- Telugu News Photo Gallery Technology photos List of best smart watches under 1k, check here for full details
Smart watch: రూ. వెయ్యిలోపు అందుబాటులో.. బెస్ట్ స్మార్ట్ వాచ్‌లు ఇవే..
ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌లకు భారీగా ఆదరణ లభిస్తోంది. ఒకప్పుడు వాచ్ అంటే కేవలం సమయం తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక గ్యాడ్జెట్ మాత్రమే. అయితే స్మార్ట్ వాచ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాచ్ రూపమే మారిపోయింది. ఇక కంపెనీల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో వాచ్‌ల ధరలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. మరి రూ. వెయ్యిలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ వాచ్‌లపై ఓ లుక్కేయండి..
Updated on: Jun 04, 2024 | 1:47 PM

ఇక వెయ్యి రూపాయలలోపు అందుబాటులో ఉన్న మరో బెస్ట్ స్మార్ట్ వాచ్‌లలో బీట్ ఎక్స్‌పి మార్వ్ నియో స్మార్ట్ వాచ్ ఒకటి. ఈ వాచ్‌లో 100కిపైగా స్పోర్ట్స్ మోడ్‌లను అందించారు. అలాగే హెల్త్ పరంగా ఇందులో హార్ట్ మానిటరింగ్‌తో పాటు మరెన్నో ఫీచర్లను అందించారు. ఇక ఈ వాచ్‌లో ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్‌ను ఇచ్చారు. ఈ వాచ్ ధర రూ. 999గా నిర్ణయించారు.

వెయ్యి లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచ్‌లలో బోట్ ఎక్స్‌టెండ్ వాచ్ ఒకటి. అమెజాన్‌లో ఈ వాచ్ రూ. 999కి అందుబాటలో ఉంది. ఈ వాచ్‌లో 1.69 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. ఇందులో స్లీప్ మానిటర్, వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లను అందించారు.

తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ స్మార్ట్ వాచ్‌లో ఫైర్ బోల్ట్ నింజా 3 ప్లస్ ఒకటి. ఈ వాచ్ అమెజాన్‌లో రూ. 999కి అందుబాటులో ఉంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ వాచ్‌లో 1.83 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ వాచ్‌లో 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను ఇచ్చారు.

తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ స్మార్ట్ వాచ్‌లో నాయిస్ వివిడ్ కాల్ 2 ఒకటి. ఈ వాచ్‌లో 1.85 ఇంచెస్‌తో కూడిన హెడ్‌డీ డిస్‌ప్లే స్క్రీన్‌ను అందించారు. బ్లూటూత్ కాలింగ్‌తో ఈ వాచ్ పనిచేస్తుంది. అలాగే ఇందులో IP68 వాటర్‌ప్రూఫ్, 7 రోజుల బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లను అందించారు. ఈ వాచ్ అమెజాన్‌లో రూ. 999కి అందుబాటులో ఉంది.

టాగ్ వెర్వ్ నియో స్మార్ట్ వాచ్ ధర రూ. 719కి అందుబాటులో ఉంది. ఈ వాచ్ ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.69 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. అలాగే ఇందులో 60 ప్లస్ స్పోర్ట్స్ మోడ్స్‌ను ఇచ్చారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల పాటు పనిచేస్తుంది.



















