- Telugu News Photo Gallery Technology photos Oppo Launching new smart phone Oppo Reno 11 price and features details
Oppo Reno 11: ఒప్పో నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ ఎలా ఉండనున్నాయంటే.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఒప్పో రెనో 11 పేరుతో ఈ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. తొలుత చైనా మార్కెట్లో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. అనంతరం భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Nov 19, 2023 | 8:34 PM

ఒప్పో రెనో 11 సిరీస్‌లో భాగంగా రెండు ఫోన్‌లను తీసుకురానున్నారు. ఒప్పో రెనో 11, ఒప్పో రెనో 11 ప్రో వేరియంట్స్‌లో రెండు ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. చైనాలో ఇప్పటికే ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్‌ను ప్రారంభించాయి. ఈ ఫోన్‌లో ఫ్లాగ్ షిప్ ఇమేజింగ్ ఆల్గరిథమ్‌ను ఇవ్వనున్నారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్‌ఓసీ చిప్‌సెట్ ప్రాసెస్‌ను అందించనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌ను ఫ్లూరైట్ బ్లూ, టర్క్యౌజ్, ఒబ్సిడియాన్ బ్లాక్ కలర్స్‌లో తీసుకురానున్నారు.

కెమెరా విషయానికొస్తే ఒప్పో రెనో 11 ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఎస్ఎల్ఆర్ పొర్ట్రైట్ లెన్స్ కెమెరా, 32-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ 47 ఎంఎం ఫోకల్ లెంత్ సెన్సర్‌ను ఇవ్వనున్నారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 4700 ఎమ్‌ఏహెచ్ సూపర్ వూక్ ఛార్జింగ్‌ను అందిచంనున్నారు. యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్ను అందించనున్నారు. ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌ను ఇవ్వనున్నారు.

నవంబర్ 23వ తేదీన చైనా మార్కెట్లో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఇక ఈ ఫోన్‌లో 6.81 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇవ్వనున్నట్లు సమాచారం. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం.




