- Telugu News Photo Gallery Technology photos Motorola launching new smartphone Moto g45 features and price details
Moto g45: బడ్జెట్ ధరలో మోటో 5జీ ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవు..
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటోరోలా కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. తక్కువ బడ్జెట్‌లో 5జీ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. మోటో జీ45 పేరుతో ఈ ఫోన్‌ను ఆగస్టు 21వ తేదీన లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా ప్రీమియం లేగన్ లెదర్ డిజైన్‌తో తీసుకొస్తున్నారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Aug 21, 2024 | 7:03 PM

దేశంలో 5జీ సేవలు వేగంగా విస్తరిస్తున్న తరుణంలో 5జీ సపోర్ట్ ఫోన్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ఇందులో భాగంగానే ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలన్నీ కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ ధరలో 5జీ ఫోన్‌లను తీసుకొచ్చే పనిలో పడ్డాయి.

ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. మోటీ జీ45 పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్ ఆగస్టు 21వ తేదీ లాంచ్ కానుంది. ఈ ఫోన్‌ను ప్రీమియం వేగన్ లెదర్ డిజైన్‌తో తీసుకురానున్నారు.

ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఇక ఇందులో 6.5 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు ప్రొటెక్షన్ కోసం ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3ని అందించనున్నారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్‌ను అందించారు. ఫ్రంట్ కెమెరాకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ ఫోన్‌లో ఎమ్‌ఏహెచ్‌తో కూడిన పవర్‌ఫుల్ బ్యాటరీని అందించనున్నారు.

ధర విషయానికొస్తే ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15 వేల రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ను రెండ్, గ్రీన్, బ్లూ కలర్స్‌లో తీసుకొస్తున్నారు.




