Moto G04s: రూ. 10వేలలో కళ్లు చెదిరే ఫీచర్లు.. మోటో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్..
ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ మోటోరోలో ఇటీవల మార్కెట్లోకి వరుసగా స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో బడ్జెట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. మోటో జీ04ఎస్ పేరుతో ఈ ఫోన్‌ను భారత్‌లోకి లాంచ్ చేయనున్నారు. ఇంతకి ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
![ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. మోటో జీ04ఎస్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ నెల 30వ తేదీన ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. మోటోరోలా నుంచి ఇప్పటికే వచ్చే వచ్చిన మోటో ఎడ్జ్ 50 ఫ్యుజన్కు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/05/moto-g04s-price.jpg?w=1280&enlarge=true)
1 / 5
![ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్‌ను ఇవ్వనున్నారు. అలాగే స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం ఇందులో గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. యూనిసోక్ టీ606 ఒక్టాకోర్ ప్రాసెసర్ విత్ 4జీబీ ర్యామ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/05/motorola.jpg)
2 / 5
![ఈ ఫోన్లో ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 4 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందించారు. మోటో జీ04ఎస్ స్మార్ట్ ఫోన్లో డాల్బీ ఆట్మోస్ ఆడియోను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/05/motorola-new-phone.jpg)
3 / 5
![కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఏఐ పవర్డ్ రెయిర్ కెమెరాను అందించారు. ఎల్ఈడీ ఫ్లాష్‌ను అందించారు. ఇక ఈ ఫోన్ నైట్ విజన్, పోర్ట్రైట్ మోడ్‌కు సపోర్ట్ చేస్తుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/05/moto-new-phone-1.jpg)
4 / 5
![బ్లాక్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్ కలర్స్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్లో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందిస్తున్నారు. ధర విషయానికొస్తే భారత కరెన్సీ ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ రూ. 10,700గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. లాంచింగ్ ఆఫర్లో భాగంగా పలు ఈ కామర్స్ సంస్థలు ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌ను అందించనున్నారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/05/moto-2.jpg)
5 / 5