- Telugu News Photo Gallery Technology photos Instagram introducing new feature backdrop that can edit photos
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఏఐ టెక్నాలజీతో..
ఇన్‌స్టాగ్రామ్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేశారు. బ్యాక్‌డ్రాప్ పేరుతో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ కొత్త ఫీచర్ ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Dec 16, 2023 | 10:58 PM

ప్రముఖ సోషల్ మీడియా సైట్ ఇన్‌స్టాగ్రామ్ తాజాగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. 'బ్యాక్‌డ్రాప్' పేరుతో ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేశారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతోన్న నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ సైతం ఏఐ ఆధారిత ఫీచర్‌ను తీసుకొచ్చింది.

'బ్యాక్‌డ్రాప్' పేరుతో ఈ కొత్త ఏఐ మీడియా ఎడిటింట్ టూల్‌ను తీసుకొచ్చింది. ఇన్‌స్టా తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ యూజర్లకు ఫొటోల కోసం సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.

కృత్రిమ మేథ ఆధారంగా రూపొందించిన ఈ టూల్‌తో ఫొటోలను డైనోసార్లతో నడిచినట్లు, కుక్క పిల్లలతో ఆడుతున్నట్లు డిజైన్ చేసుకోవచ్చు. బ్యాక్ గ్రౌండ్‌ను మార్చడానికి ఏఐ టూల్ ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం బ్యాక్‌డ్రాప్ ఫీచర్ అమెరికాలోని యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే త్వరలోనే భారత్‌తో పాటు మరికొన్ని దేశాల్లో అందుబాటలోకి తీసుకురానున్నారు.

ఇదిలా ఉంటే.. ఇన్‌స్టా ఇంతకు ముందు స్టోరీస్‌లకు ఫిల్టర్‌లు, ప్రత్యేక ఎఫెక్ట్‌లను అందించగా, ఇప్పుడు తీసుకొచ్చిన ఏఐ పవర్ టూల్‌తో ఫొటోలను మరింత అందంగా తీర్చుదిద్దుకోవచ్చు. బ్యాక్‌డ్రాప్ అనే ఆప్షన్ ఎంచుకుని ఫొటోను యాడ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు.





























