- Telugu News Photo Gallery Technology photos Simple energy ev startup company launched Dot One electric scooter, Check here for price and features
Electric scooter: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కి.మీలు దూసుకుపోవచ్చు.. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
దేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది. అధునాతన ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ అనే ఈవీ స్టార్టప్ కొత్త స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. డాట్ వన్ పేరుతో ఈ స్కూటర్‌ను లాంచ్ చేశారు. ఇంతకీ ఈ స్కూటర్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Dec 18, 2023 | 12:38 PM

భారత ఆటో మొబైల్ మార్కెట్లోకి 'డాట్ వన్' పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేశారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఈ స్కూటర్‌ను రూ. 99,999గా నిర్ణయించారు. అయితే ముందుస్తుగా బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుంది. తర్వాత ధర పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించారు. త్వరలోనే స్కూటర్లను డెలివరీ చేయనున్నారు. ఇక ఈ స్కూటర్ ఫీచర్ల విషయానికొస్తే.. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 160 కిమీలు రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే వాతావరణ పరిస్థితులు, రోడ్డు ఆధారంగా కనీసం 151 కిమీ మైలేజ్ ఇస్తుందని సమాచారం.

ఇక ఈ స్కూటర్‌లో 3.7 కిలో వాట్స్ కలిగిన బ్యాటరీని అందించారు. పికప్ విషయంలోనూ ఈ స్కూటర్ మంచి పర్ఫామెన్స్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. కేవలం 2.77 సెకన్లలోనే గంటకు 0 నుంచి 40 కిమీల వరకు వేగాన్ని పుంజుకుంటుంది.

ఇందులో అందించిన 8.5 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటర్, 72 న్యూటన్ మీటర్ టార్క్‌ను అందిస్తుంది. డాట్ వన్ స్కూటర్‌లో 35 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్‌ను అందించారు.

ఇక డిజైన్ పరంగా కూడా ఈ స్కూటర్‌ను స్పోర్టివ్ లుక్‌లో తీసుకొచ్చారు. ఇందులో 8500 మోటర్ పవర్‌ను అందించారు. 105 కిలోమీటర్ల టాప్ వేగంతో దూసుకుపోతుంది. స్కూటీ 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ కావడానికి 3 గంటల 47 నిమిషాలు పడుతుంది.





























