Narender Vaitla |
Updated on: Aug 26, 2022 | 7:22 PM
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్ 12 ప్రో పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్‌ను బడ్జెట్ ధరలో తీసుకొచ్చారు.
ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.
33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఇక సౌండ్ విషయానికొస్తే ఇందులో డీటీఎస్ సరౌండ్ సౌండ్ సపోర్ట్ సిస్టమ్‌ను అందించారు.
కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
ధర విషయానికొస్తే ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.16,999 కాగా కొన్ని బ్యాంక్‌ల కార్డ్‌లతో కొనుగోలు చేస్తే రూ. 14,999కి సొంతం చేసుకోవచ్చు.