- Telugu News Photo Gallery Technology photos HMD Launching 2 feature phones HMD 105 and HMD 110 phones
HMD: మంచి ఫీచర్ ఫోన్ కోసం చూస్తున్నారా.? రూ. 2వేల ధరలో..
ఓవైపు మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఫీచర్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఇటీవల జియో ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. 4జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే ఫీచర్స్ ఫోన్స్‌కి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ హెచ్‌ఎండీ రెండు కొత్త ఫోన్‌లను లాంచ్ చేసింది. హెచ్‌ఎండీ 105, హెచ్‌ఎండీ 110 పేరుతో ఫోన్‌లను తీసుకొచ్చారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Sep 12, 2024 | 10:02 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ హెచ్‌ఎండీ భారత మార్కెట్లోకి రెండు కొత్త ఫోన్‌లను తీసుకొచ్చారు. హెచ్‌ఎండీ 105, 110 పేర్లతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొచ్చారు. ఈ రెండు ఫోనలలో కూడా 1450 ఎమ్‌ఏహెచ్ వంటి బ్యాటరీని అందించారు. దీంతో పాటు మరెన్నో సూపర్ ఫీచర్లను అందించారు.

ధర విషయానికొస్తే హెచ్‌ఎండీ 105 4జీ ధర రూ. 2,199కాగా, హెచ్‌ఎండీ 110 4జీ ధర రూ. 2399గా నిర్ణయించారు. ఈ ఫోన్‌లను బ్లాక్, సియాన్, పింక్, టైటానియం,బ్లూ కలర్స్‌లో తీసుకొచ్చారు. ఈకామర్స్ సైట్స్‌తో పాటు హెచ్‌ఎండీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఈ ఫోన్‌తో ఏడాది రీప్లేస్‌మెంట్ గ్యారెంటీని అందిస్తోంది. ఇక ఈ ఫోన్ 23 భాషలు, 13 ఇన్‌పుట్ భాషలను సపోర్ట్ చేస్తుంది. క్లౌడ్ ఫోన్ యాప్ ద్వారా యూట్యూబ్, యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ షార్ట్‌లను వీక్షించవచ్చు.

ఈ ఫోన్‌లో ప్రీలోడెడ్ కూడా యూపీఐ పేమెంట్స్ యాప్‌ను అందిస్తోంది. ఫోన్‌లో MP3 ప్లేయర్, వైర్‌లెస్ FM రేడియో ఆప్షన్స్‌ను అందించారు. 32GB ఎస్డీ కార్డుకు ఈ పక్షన్ సపోర్ట్ చేస్తుంది.

ఫోన్ టాకర్ వంటి అధునాతన ఫీచర్ ఈ ఫోన్ సొంతం. ఇక ఈ ఫోన్ 23 భాషలు, 13 ఇన్‌పుట్ భాషలను సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన జియో ఫీచర్ ఫోన్‌లకు ఇది పోటీ ఇవ్వనున్నట్లు స్పష్టమవుతోంది.





























