- Telugu News Photo Gallery Technology photos Gizmore launches new smart watch gizfit glow z price details Telugu Tech News
Smartwatch: రూ. 1,500లో స్టన్నింగ్ స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ కూడా ఉందండోయ్.
భారత్‌కు చెందిన గిజ్మోర్ కంపెనీ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌ను తక్కువ ధరకే లాంచ్ చేయడం విశేషం. రూ. 1500కి లభిస్తోన్న ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఓ లుక్కేయండి..
Updated on: May 25, 2023 | 8:18 PM

మార్కెట్లో నెలకొన్న పోటీ నేపథ్యంలో స్మార్ట్ వాచ్‌ల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. రకరకాల కంపెనీలు యూజర్లను ఆకట్టుకునే క్రమంలో తక్కువ ధరకే వాచ్‌లను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా గిజ్మోర్ అనే కంపెనీ బడ్జెట్ ధరలో వాచ్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది.

గిజ్మోర్ GIZFIT Glow Z పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 1999 కాగా లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా రూ. 1,499కే అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉంది.

ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.78 - ఇంచెస్ 2.5D కర్వ్డ్ HD AMOLED స్క్రీన్‌ను అందించారు. 368×448 పిక్సెల్‌ల రిజల్యూషన్, 600 నిట్‌ల బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం.

ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌ను అందించారు. దీంతో యూజర్లు కాల్స్ మాట్లాడుకోవచ్చు. హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, హార్ట్ రేట్ సెన్సార్, ఇంకా 120కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు అందించారు.

వాటర్ ఇన్‌టేక్ రిమైండర్‌లు, AI వాయిస్ అసిస్టెన్స్, వెదర్ అప్‌డేట్స్, మల్టీ-లాంగ్వేజ్ సపోర్ట్ వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఇక IP67-రేట్‌తో వాటర్ రెసిస్టెంట్స్ అందించారు. అరగంట పాటు మీటరు లోతు వరకు నీటిలో మునిగిపోయినా పనిచేయడం ఈ వాచ్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.





























