PM Modi: ‘మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా’ కోసం కేంద్రం కీలక నిర్ణయం.. టెక్నాలజీలో భారత్ సరికొత్త విప్లవం..
ఏఐ ఈ రెండు అక్షరాలు నేడు ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త సాంకేతికతను ప్రతి ఒక్క రంగం అందిపుచ్చుకుంటోంది. స్కూల్ పిల్లల మొదలు గేమ్స్ వరకు అంతా విస్తరించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక బడ్జెట్ ను రూపొందించింది. నేడు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో రూ. 10,371.92 కోట్లతో జాతీయ స్థాయి ఇండియా ఏఐ మిషన్ కు శ్రీకారం చుట్టింది.