- Telugu News Photo Gallery Technology photos Best offer on iffalcon 43 inch smart tv have a look on features and price details Telugu Tech News
Iffalcon smart tv: రూ. 17 వేలకే 43 ఇంచెస్, 4కే అల్ట్రాహెచ్‌డీ టీవీ సొంతం చేసుకునే అవకాశం.. ఆఫర్ కొన్ని గంటలే..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫినాలే డేస్ సేల్‌లో భాగంగా ఐఫాల్కన్ స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్‌ను అందించారు. ఈ టీవీ అసలు ధర రూ. 47,990కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 17,990కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఉన్న ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Oct 23, 2022 | 6:08 PM

ఈకామర్స్ సంస్థ అమెజాన్.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫినాలే డేస్ సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్ నేటితో (ఈనెల 23) ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఐఫాల్కన్ స్మార్ట్ టీవీని తక్కువ ధరకు సొంతం చేసుకునే అవకాశం కల్పించింది.

ఐఫాల్కన్ 43 ఇంచెస్ 4కే స్మార్ట్ టీవీ 43U61 స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 47,990 కాగా, ఆఫర్‌లో భాగంగా రూ. 17,990కి సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా పలు బ్యాంకుల క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను పొందొచ్చు. అయితే ఈ ఆఫర్ ఆదివారం అర్థరాత్రితో ముగియనుంది.

ఇక ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 3840x2160 పిక్సెల్స్ 4K రెజల్యూషన్ ఉండే 43 ఇంచుల డిస్‌ప్లేను అందించారు. 60Hz రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్10 సపోర్ట్, మైక్రో డిమ్మింగ్ ఫీచర్లు ఉంటాయి. 24 వాట్ల సౌండ్ ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లను ఈ టీవీలో అందించారు.

ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ టీవీలో 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. ఓటీటీ యాప్స్ సపోర్ట్ చేస్తుంది.

గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికొస్తే వైఫై, బ్లూటూత్, 3 హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, ఓ యూఎస్‌బీ పోర్ట్, ఆడియో జాక్, ఎథెర్‌నెట్ పోర్ట్ కనెక్టివిటీలను అందించారు.





























