- Telugu News Photo Gallery Taking Red Bananas Regularly Gives These Amazing Health Benefits In Telugu
Health Tips: మధుమేహానికి దివ్య ఔషధం ఈ పండు.. ఇంకా ఎన్నో లాభాలు..!
Red Banana Benefits: ఎరుపు అరటి.. షుగర్ బాధితులకు దివ్య ఔషధం ఈ పండ్లు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు నిండివున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణ అరటి కంటే ఎరుపు అరటి పండులో ఎక్కువ పోషకాలు ఉన్నాయని అంటున్నారు. ఎరుపు అరటిలో బీటా కెరోటిన్, విటమిన్ సి, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల మధుమేహంతో పాటుగా శరీరానికి మరెన్నో లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jun 24, 2025 | 7:13 AM

ఎరుపు అరటి పండును తరచూ తీసుకోవటం వల్ల కంటిచూపును మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. దృష్టి లోపాలను నివారిస్తుంది. మహిళల్లో ఎక్కువగా వచ్చే రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. నరాలను బలపరుస్తుంది. అంతేకాదు..కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించడంలో సహాయపడుతుంది.

ఎరుపు రంగు అరటి పండు తరచూ తీసుకోవటం వల్ల అజీర్తి, పైల్స్, దృష్టి లోపాలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.. రోజుకు ఓ అరటి పండును 21 రోజుల పాటు తీసుకుంటే దృష్టి లోపాలతో పాటు విటమిన్ సి లోపం తొలగిపోతుంది. ఎరుపు అరటితో జీర్ణక్రియ మెరుగవుతుంది. శరీరానికి శక్తిని ఇస్తుంది, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఎరుపు రంగు అరటి పండ్లకు పంటి నొప్పులను దూరం చేసే గుణం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఛాతిలో మంటతో ఇబ్బంది పడేవారు.. రోజుకో ఎరుపు అరటిని తీసుకోవచ్చునని సూచిస్తున్నారు. దీంతో ఛాతి, కడుపులో మంట సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

ముఖ్యంగా సంతానలేమి సమస్యలను తగ్గించడంలో ఎరుపు అరటి పండు అద్భుత మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఎరుపు రంగు అరటిలో ఐరన్, క్యాల్షియం అధికం. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు రోజు ఓ ఎరుపు అరటిని తీసుకుంటే శరీరంలో జీవకణాల ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా గర్భం దాల్చడం సులభం అవుతుందని అంటున్నారు.

ఎరుపు అరటి పోషకాల గని అయినప్పటికీ, కొంతమంది వ్యక్తులు దీన్ని జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్. అరటిపండులో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ ఉన్నవారు దీన్ని తీసుకోవడానికి ముందు వైద్యుని సలహా తీసుకోవాలి. మలబద్ధకం ఉన్నవారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవటం ఉత్తమం.




