AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జామ ఆకులతో కళ్లు చెదిరే ఆరోగ్య ప్రయోజనాలు..ఇలా వాడితే బొడ్డు కొవ్వు కరిగి నాజుగ్గా..

జామ పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో జామ ఆకులతో కూడా అంతకు మించి ప్రయోజనాలు పొందవచ్చునని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అనేక రోగాలకు జామ ఆకులు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి. ఈ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా నయమవుతాయంటున్నారు నిపుణులు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం...

Jyothi Gadda
|

Updated on: Sep 13, 2024 | 9:20 PM

Share
జామ ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది కడుపు పూతల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. దగ్గు, దురద మొదలైన వాటితో బాధపడుతున్నవారు జామ ఆకులను తినాలి. ఎందుకంటే వీటిలో శరీరానికి ఉపశమనాన్ని అందించే యాంటీ అలర్జీ లక్షణాలు ఉంటాయి.

1 / 5
జామ ఆకులను వివిధ రూపాల్లో తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. జామ ఆకులలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి శరీరానికి సహాయపడే అనేక అంశాలు ఉన్నాయి. జామ ఆకుల టీ తాగితే రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. జామ ఆకుల టీ తాగితే చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గి, మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. అంతే కాదు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె జబ్బుల సమస్యలను దూరం చేస్తుంది.

2 / 5
జామ ఆకుల టీ తో జీర్ణ వ్యవస్థలో ఉన్న చెడు బ్యాక్టీరియా తొలగుతుంది. ఇందులోని డైటరీ ఫైబరీ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. జామ ఆకులను తీసుకోవడంతో డెంగ్యూ నుంచి వేగంగా కోలుకోవచ్చు. జామ ఆకుల ఎక్స్‌ట్రాక్ట్‌ను తీసుకుంటే రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య వేగంగా పెరుగుతుంది. జ్వరం తీవ్రత సైతం తగ్గుతుంది.

3 / 5
జామ ఆకులను ఉదయాన్నే ఖాళీ కడుపుతో పొట్టతో నమిలితే ఎక్కువ ప్రయోజనాలు శరీరానికి అందుతాయంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఆ ఆకులను రెండు నిమిషాలపాటూ నీటిలో నానబెట్టాలి. ఆ ఆకులపై ఉన్న మురికి పోతుంది. అలా శుభ్రంగా కడిగిన తరువాత రెండు ఆకులను నమలడం మంచిది. ఆ సారాన్ని మింగేస్తే ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.

4 / 5
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూడా జామ ఆకులను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే ఇమ్యునిటీ పెరుగుతుంది. జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం లాంటి చిన్న చిన్న సమస్యలను చాలా సులువుగా అధిగమించేలా  రోగనిరోధకశక్తి పెంచుతుంది. జామ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది.

5 / 5
Follow Us