ఈ మధ్యకాలంలో పుట్టినవారే ఎక్కువగా అబద్ధాలు ఆడుతున్నారు.. తాజా సర్వేలో వెల్లడి

ఈరోజుల్లో అబద్ధాలు ఆడకుండా ఎవరూ ఉండలేరు. అత్యవసర సందర్భాల్లో కచ్చితంగా అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే పెద్దలు కూడా ఇతరులను బాధపెట్టకుండా అబద్ధాలు ఆడటం తప్పేమి కాదని చెబుతుంటారు. అయితే అబద్ధాలు చెప్పే విషయంపై వివిధ వయసుకు సంబంధించిన వాళ్లపై అమెరికాలోని ఆన్‌లైన్ కాసినో ప్లేస్టార్ ఓ సర్వే నిర్వహించింది.

Aravind B

|

Updated on: Jul 09, 2023 | 9:25 PM

1 / 5
ఈ సర్వే ప్రకారం అమెరికాలోని పలు రాష్ట్రాల్లో 1306 మందిపై ప్లేస్టార్ సర్వే చేసింది. ఇందులో 1981 నుంచి 1996 మధ్య పుట్టినవారిలో 13 శాతం మంది రోజుకు ఒక్కసారైనా అబద్ధం ఆడతామని అంగీకరించారు.

2 / 5
1946 నుంచి 1964 మధ్య పుట్టినవారు 2 శాతం మాత్రమే రోజుకు ఒకసారి అబద్ధం ఆడతాని తెలిపారు. అలాగే 1997 నుంచి 2021 మధ్య, 1965 నుంచి 1980 మధ్యన పుట్టిన వారికి దాదాపు ఒకేరకంగా ప్రవర్తన ఉంది. వీరిలో 5 శాతం మంది రోజులో కనీసం ఒక్కసారైనా అబద్ధమాడుతామని ఒప్పుకున్నారు.

3 / 5
1981 నుంచి 1996 మధ్య పుట్టిన వాళ్లు తాము పనిచేసే దగ్గర అవమానకర పరిస్థితుల నుంచి తప్పించుకనేందుకు తమ బాస్‌కు అబద్ధం చెబుతామని తెలిపారు. మరికొందరు ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు రెజ్యూమ్‌లో మార్పులు చేస్తామని చెప్పారు.

4 / 5
అలాగే ప్రతి నలుగురిలో ఒకరు.. ఇతరుల దృష్టి తమపై పడేలా చేసేందుకు కొన్నిసార్లు సోషల్‌ మీడియాలో నిజాలు చెప్పట్లేదని చెప్పారు. వాస్తవానికి మహిళలతో పోలిస్తే పురుషులు సామాజిక మాధ్యమాల్లో 10 శాతం ఎక్కువగా అబద్ధాలు చెబుతున్నట్లు అంగీకరించారు. అయితే తాము చెప్పే ఈ అబద్ధాలు ప్రతిసారి హాని కలిగించేవేమీ కాదని చెప్పినట్లు సర్వేలో వెల్లడైంది .

5 / 5
Follow us