F1 డ్రైవర్ లూయిస్ హామిల్టన్ కార్ రేసింగ్ ప్రపంచంలో అతిపెద్ద సూపర్ స్టార్‌లలో ఒకరిగా పేరుగాంచిన సంగతి తెలసిందే. బ్రిటన్‌కు చెందిన ఈ ఆటగాడు తన చిన్నతనంలో నల్లగా ఉన్న కారణంగా వివక్ష, వేధింపులకు గురయ్యాడు. కానీ, ఇప్పటికీ అతను ప్రపంచంలోనే అత్యంత ఇష్టపడే క్రీడా వ్యక్తిగా నిలిచాడు. జనవరి 7, శుక్రవారంతో హామిల్టన్ 37వ ఏట అడుగుపెడుతున్నాడు.