Vivah Panchami 2021: వైవాహిక జీవితంలో సమస్యలా అయితే వివాహ పంచమిరోజున ఇలా చేయండి.. అడ్డంకులు తొలగిపోతాయి

Vivah Panchami 2021: మార్గశీర్ష మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే పంచమికి విశిష్ట స్థానం ఉంది. ఈరోజున వివాహ పంచమి రోజుగా హిందువులు జరుపుకుంటారు. సీతారాములనుపూజిస్తే వివాహ ఆటంకాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు వివాహ పంచమి రోజున కొన్ని చర్యలు తీసుకొంటే కుటుంబంలో సుఖ శాంతులు ఏర్పడతాయని.. వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయని పురాణాల కథనం. 

Surya Kala

|

Updated on: Nov 27, 2021 | 9:37 PM

మార్గశీర్ష మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే పంచమి రోజు పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. రోజున శ్రీరాముడు సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. అందుకనే ప్రతి సంవత్సరం పంచమి తిథిని వివాహ పంచమిగా జరుపుకుంటారు. ఈసారి వివాహ పంచమి 8 డిసెంబర్ 2021 బుధవారం వచ్చింది.

1 / 5
ఈ రోజున శ్రీరాముడిని, సీతను పూజించడం వల్ల వివాహ ఆటంకాలు తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాదు ఎవరి వైవాహిక జీవితంలో సమస్యలు  ఉన్నా శుభప్రదమైన ఈరోజు పూజ చేస్తే.. జీవితం ఆనందమయం అవుతుంది. జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగించగల నివారణల గురించి తెలుసుకుందాం.

2 / 5
మంచి జీవిత భాగస్వామి కోసం వివాహ పంచమి రోజున ఉపవాసం ఉండి శ్రీరాముడిని, సీతను పూజించాలి. అంతేకాదు తనకు తగిన జీవిత భాగస్వామిని ఇవ్వమని ఆ సీతారామానులను ప్రార్థించాలి. వివాహ పంచమిరోజున సీతారాములను పూజిస్తే వివాహంలో ఏర్పడిన అన్ని రకాల ఆటంకాలు తొలగిపోతాయి.

3 / 5
 సీతారాములు ఆదర్శజంటగా ఖ్యాతిగాంచింది, వివాహా పంచమిరోజున వైవాహిక జీవితంలో ఏదైనా సమస్య ఉన్నవారు  రామచరితమానస్‌ ను పఠించాలి. తమ సమస్యను తొలగించమని శ్రీరామ చంద్రుడిని ప్రార్థించాలి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలు సమసిపోతాయి. పంచమి రోజున రామచరిత్మానస్ ను ఇంట్లో పారాయణం చేస్తే, ఇంట్లో శాంతి ఏర్పడుతుందని నమ్మకం.

4 / 5
 
వివాహం జరిగి.. పిల్లలు లేని దంపతులకు వివాహ పంచమి శుభ తిధి.. పిల్లలేనివారు సీతారాములను పూజిస్తే.. ఆ దంపతులకు  లవకుశలు వంటి అద్భుతమైన పిల్లలు పుడతారని నమ్మకం. శ్రీరాముని ,సీతమ్మని పూజించేటప్పుడు..  శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించాలి. అంతేకాదు తమకు మంచి సంతానం కలగాలని ప్రార్థించాలి. దీనితో, మీ కోరిక నెరవేరుతుంది. అంతేకాదు సంతానానికి ఏమైనా ఇబ్బందులున్నా కూడా తొలగి సంతోషంగా ఉంటారు.

5 / 5
Follow us