- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips: These are the Vastu remedies to follow to get rid of debt problems
ఏంటీ? ఎప్పుడూ అప్పుల బాధలేనా.. ఈ వాస్తు టిప్స్ ట్రై చేయండి!
ఈ రోజుల్లో ఎవరి నోట విన్నా, మనీ మనీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనే మాటలే ఎక్కువ వినిపిస్తున్నాయి. చాలా మంది చేతిలో డబ్బులు లేక, అప్పుల సమస్యలతో సతమతం అవుతున్నారు. అయితే ఇలా అప్పులు పెరిగిపోవడానికి ముఖ్యకారణం వాస్తు దోసం అంటున్నారు పండితులు. మరీ ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అంటే, ఎలాంటి వాస్తు పరిహారాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.
Updated on: Nov 02, 2025 | 2:12 PM

వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. వాస్తు నియమాలు పాటించిన వారిలో చాలా వరకు ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు ఉండవు, కానీ ఎవరైతే వాస్తు నియమాలను ఉల్లంఘిస్తారో, వారు అనేక ఇబ్బందులు పడుతుంటారు. అయితే మీ ఇంటిలో గనుక అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నట్లు అయితే, మీకు వాస్తు దోషం ఉన్నట్లే అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

ఎవరైతే తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోరో, అలాగే అవసరం లేని వస్తువులను కూడా ఇంటిలోనే ఉంచుకుంటారో, వారు నిత్యం అప్పుల బాధలతో సతమతం అవుతారంట. అలాగే ముఖ్యంగా ఉత్తరం దిశ కుబేరుడిది. కాబట్టి ఎప్పుడూ కూడా ఉత్తరం దిశ చాలా శుభ్రంగా, ఎలాంటి బరువులు లేకుండా ఉండాలంట.

వాస్తు ప్రభావం వంట గదిపై చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఎవరైతే వంటగదిని శుభ్రంగా ఉంచుకోరో, అలాగే స్టవ్, సింక్ ఒకదానికి మరొకటి పక్క పక్కనే ఉంటుందో, వారికి అప్పుల బాధలు ఎక్కువ ఉంటాయంట. ఇక అప్పుల బాధలతో బాధపడే వారు తమ ఇంటికి ఉత్తరం దిశలో వాటర్ ఫౌంటైన్ పెట్టుకోవడం వలన డబ్బు సమస్యలన్నీ తొలిగిపోతాయంట.

ఇంటిలో సంపద పెరగాలి అంటే ఎప్పుడుూ కూడా మీ ఇంటి ప్రధాన ద్వారం చాలా అందంగా, అలంకరించబడి ఉండాలంట. ముఖ్యంగా శుక్రవారం, పండుగల సమయంలో ప్రధాన ద్వారాన్ని అలంకరించి, పసుపు, కుంకుమతో పూజించడం వలన పాజిటివ్ వైబ్స్ రావడమే కాకుండా, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, ఇంటిలోని ఆర్థిక సమస్యలన్నీ తొలిగిపోతాయంట.

అలాగే అప్పుల సమస్యలన్నీ తొలిగిపోవాలి అంటే,ఇంటిలోని నైరుతి దిశ లేదా ఉత్తరం దిశలో బీరువా లేదా, గల్ల పెట్టెలు పెట్టుకోవడం మంచిదని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. (నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)



