- Telugu News Photo Gallery Spiritual photos Unexpected benefits for these zodiac signs due to Saturn's transit into the star
మ్యాజిక్ చేయనున్న శని.. ఈ రాశుల వారికి ఊహించని లాభాలు!
జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. దీని ప్రభావం రాశుల వారిపై ఎక్కువగా ఉంటుంది. అయితే శని గ్రహం మంచి స్థానంలో ఉంటే, అది అనుకోని విధంగా శుభ ఫలితాలనిస్తుంది. కానీ శని నీచ స్థానంలో ఉంటే అనేక కష్టాలు, నష్టాలు, పనుల్లో ఆటంకాలు వంటి సమస్యలు ఎదుర్కోక తప్పదు అని చెబుతుంటారు పండితులు. అయితే, 27 ఏళ్ల తర్వాత శని గ్రహం వలన మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానున్నదంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.
Updated on: Aug 06, 2025 | 8:59 PM

2025 అక్టోబర్ నెలలో 3వ తేదీన శని గ్రహం పూర్వ భాద్రపాదనక్షత్రంలోకి సంచారం చేయనుంది. ఈ నక్షత్రానికి గురువు బృహస్పతి అధిపతిగ వ్యవహరిస్తుండటం, అలాగే అప్పటికే బృహస్పతి అదే గ్రహంలో సంచరిస్తుండటం, శని , బృహస్పతిల కలయిక వలన అద్భుతమైన మ్యాజిక్ జరగనుంది. దీంతో మూడు రాశుల వారికి ఊహించని విధంగా లాభాలు చేకూరనున్నాయంట. కాగా, ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

మిథున రాశి : మిథున రాశి వారికి శని గ్రహం నక్షత్ర సంచారం వలన అదృష్టం కలిసి వస్తుంది. వీరికి అనుకోని విధంగా ప్రయోజనాలుచేకూరనున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగం దొరకడం, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవ్వడం, ఆర్థికంగా కలిసి రావడం జరుగుతుందంట. అంతే కాకుండా ఎవరైతే స్థిరాస్థికొనుగోలు చేయాలని ఎదురు చూస్తున్నారో వారి కోరిక కూడా త్వరలో తీరే ఛాన్స్ ఉన్నదంట.

కుంభ రాశి : కుంభ రాశి వారిపై శని సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అంతే కాకుండా శని భాద్రపాదనక్షత్రంలోకి సంచారం చేయడం వలన ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానున్నదంట. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు పొంది ఆనందంగా ఉంటారు.

తుల రాశి : తుల రాశి వారికి శని గ్రహ సంచారం వలన ఏ పని చేసినా విజయం వీరిని వరిస్తుంది. ఉద్యోగస్థులు ప్రమోషన్స్ అందుకుంటారు. విద్యార్థులకు బాగుంటుంది. ముఖ్యంగ వ్యాపార రంగంలో ఉన్న వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి. చాలా రోజుల నుంచి ఎవరైతే మంచి లాభాలకోసం ఎదురు చూస్తున్నారో, వారు ఊహించని విధంగా ప్రాఫిట్ అందుకుంటారు.

Shani Sancharam3



