- Telugu News Photo Gallery Spiritual photos Tirumala tirupati devasthanam: sri venkateswara annaprasadam trust donations crossed 2200 crores
TTD: తిరుమల అన్నప్రసాద వితరణకు విరాళాల వెల్లువ.. ఒక్క రోజు అన్న వితరణ చేయాలంటే భక్తులు ఎంత ఇవ్వాలంటే..
తిరుమలలో కొలువై కలియుగదైవంగా పూజలను అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకోవాలని..స్వామివారి దర్శనం అనంతరం అన్న ప్రసాదం స్వీకరించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోన్న ఈ గొప్ప కార్యక్రమానికి భక్తులు భారీగా విరాళాలను సమర్పిస్తారు. అయితే టీటీడీ నిర్వహిస్తోన్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు భక్తుల నుంచి వచ్చిన విరాళాలు 2200 కోట్లను దాటాయి. తిరుమలలో ఈ అన్న ప్రసాద వితరణ ఎప్పుడు మొదలైంది? భక్తులు అన్న వితరణ చేయాలంటే ఎంత మొత్తం చెల్లించాలి తెలుసుకుందాం..
Updated on: Mar 12, 2025 | 5:09 PM

ఏడుకొండల మీద ఉన్న కోనేటి రాయుడిని దర్శించుకోవడానికి వెళ్ళే భక్తులు తమ మొక్కులను తీర్చుకుంటారు. కానుకలను శ్రీవారి హుండీలో సమర్పిస్తారు. అంతేకాదు కొంతమంది భక్తులు టీటీడీ చేపట్టే వివిధ కార్యక్రమాలకు తమ మద్దతుగా వ్యాపారువేత్తలు, రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీ తదితరులు భూరి విరాళాలు అందిస్తారు. భక్తుల ఇచ్చిన విరాళాలతో శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టు, ప్రాణదానం ట్రస్టు సహా అనేక సామాజిక కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తోంది.

ఈ నేపథ్యంలో టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు విరాళాలపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. అన్న ప్రసాదం ట్రస్టు విరాళాలు రూ 2,200 కోట్లు దాటినట్లు ప్రకటించారు.

అసలు స్వామివారిని దర్శించుకునెందుకు వచ్చే భక్తులకు ఆకలి అన్న మాట లేకుండా నిత్యం అన్నపసాదాన్ని అందిస్తోన్న ఈ కార్యక్రమానికి 1985లో ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. అయితే 2014లో శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌గా పేరు మారింది

మొదట్లో 2 వేలమందితో మొదలైన అన్న ప్రసాదం వితరణ కార్యక్రమం ఇప్పుడు రోజుకు లక్ష మంది భక్తులకు అన్నవితరణ చేసే స్టేజ్ కు ట్రస్టు చేరుకుంది.

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు 9.7 లక్షల మంది దాతలు ఉన్నారు. ఈ ట్రస్ట్‌లో 139 మంది దాతలు కోటి రూపాయలకు పైగా విరాళం ఇచ్చారు.

తిరుమలకు వచ్చే భక్తులకు అందిస్తున్న ఈ అన్న ప్రసాద వితరణ ఒక్కరోజుకు రూ. 44 లక్షలు అవుతుంది. ఇలా ఒక్క రోజు అన్నవితరణ కోసం 249 మంది దాతలు విరాళమిచ్చారు.

నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ఉండే తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజుకి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. అలా వచ్చే భక్తుల ఆకలి తీరుస్తోంది అన్నప్రసాద వితరణ. ఈ బృహత్తర కార్యంలో శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవచ్చు. తమ శక్తి కొలది వివరాలను అందించవచ్చు.

అయితే ఒక్క రోజు అన్నప్రసాద వితరణ చేయాలనుకునే భక్తులు రూ. 44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క రోజు అల్పాహారం భక్తులకు అందించాలంటే రూ. 10 లక్షలు చెల్లించాలి.





