- Telugu News Photo Gallery Spiritual photos Aloe vera vastu Tips: Aloe Vera to be planted in these direction know the details
Vastu Tips: కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడానికి వాస్తు నియమాలున్నాయి.. ఈ దిశలో పెడితే కష్టాలకు వెల్కం చెప్పినట్లే..
కలబంద.. అందం, ఆరోగ్యానికి మాత్రమే కాదు వాస్తు శాస్త్రంలో కూడా ముఖ్య స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ కలబంద అదృష్టానికి చిహ్నంగా భావించి ఇంట్లో పెంచుకుంటారు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే సంపద, శ్రేయస్సుకి లోటు ఉండదని నమ్మకం. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ మొక్కని ఇంట్లో పెంచుకుంటే అనేక ప్రయోజనాలున్నాయని నమ్మకం. అయితే ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడానికి కూడా వాస్తు నియమాలున్నాయి. అవి ఏమిటంటే..
Updated on: Mar 13, 2025 | 4:03 PM

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కలబంద మొక్కు పెంచుకోవడం చాలా పవిత్రంగా భావిస్తారు. అంతేకాదు అదృష్టం కలుగుతుందని.. ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తిని పెంచుతుందని నమ్మకం. ఇంట్లో పెంచుకోగలిగే సులభమైన ఉత్తమమైన మొక్కలలో ఇది ఒకటి. ఈ నేపద్యంలో కలబంద మొక్కను వాస్తు నియమాల ప్రకారం ఏ దిశలో నాటితే మంచిదో ఈ రోజు తెలుసుకుందాం..

ఇంట్లో కలబంద మొక్కను నాటేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. ఈ మొక్కను పెంచుకోవడం వలన జీవితంలో కష్టాలు నుంచి ఉపశమనం లభిస్తుంది. కలబంద మొక్క ఉన్న ఇంట్లో ప్రేమ, ఆనందం, సంపద, ప్రతిష్ట పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.

కలబంద మొక్కను ఇంట్లో సరైన దిశలో నాటడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం ఆ ఇంటిపై సదా ఉంటుంది. సిరి సంపదలకు లోటు ఉండదు. ఎవరి ఇంట్లో ఈ మొక్క ఉంటే ఆ ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.

కలబంద నాటడానికి ఉత్తమ దిశ తూర్పు దిశ. ఈ దిశలో కలబంద మొక్క ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో కలబండను పెంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి

కలబంద మొక్కను ఆగ్నేయ దిశలో కూడా పెంచుకోవచ్చు. ఈ దిశలో కలబందను పెట్టడం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఎవరైనా ఉద్యోగంలో పురోగతిని కోరుకుంటే.. ఈ మొక్కను ఇంటికి పశ్చిమం వైపు నాటండి.

అయితే పొరపాటున కూడా కలబంద మొక్కను వాయువ్య దిశలో పెట్టవద్దు. వివిధ సమస్యలు వస్తాయి. వాస్తు ప్రకారం ఈ దిశ ఆర్థిక సమస్యలు కలిగిస్తుంది. కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అశుభ ఫలితాలు ఇస్తుంది.ప్రతికూల పరిస్థితులను ఆహ్వానిస్తుంది

Aloe Vera Vastu Tips





























