మీ జీవితం ఆనందమయం కావాలా.. హోలీ రోజు ఈ పరిహారాలు చేయండి!
హోలీ పండుగ వచ్చేస్తుంది. చిన్న వారి నుంచి పెద్దవారికి వరకు చాలా ఆనందంగా జరుపుకునే పండుగ ఈ హోలీ. ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. వివిధ రంగులను తమకు ప్రియమైన వారిపై చల్లుతూ , చాలా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ పండుగ రోజున కొన్ని పరిహారాలు చేయడం వలన జీవితం మొత్తం ఆనందమయం అవుతుందంట. కాగా, పాటించాల్సిన నియమాలు ఏవో చూద్దాం.
Updated on: Mar 11, 2025 | 5:47 PM

చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. అయితే ఇలాంటి పర్వదినాన,ప్రతి ఒక్కరూ కొన్ని పరిహారాలను తప్పకుండా పాటించాలని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

మార్చి 14న ఫాల్గుణ మాసంలో ఈ హోలీ పండుగ వస్తుంది. మార్చి 13న హోలీకా దహనం, తర్వాత రోజున హోలీ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ రోజు ఉదయాన్నే బ్రహ్మముహుర్తంలో నిద్రలేసి, పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఇంట్లో సూర్యుని ఫొటో తూర్పు దిశలో పెట్టుకోవడం వలన ఆర్థికంగా కలిసి వస్తుందంట.

అదే విధంగా హోలీ పండుగ రోజున వెండి వస్తువులు కొనడం చాలా మంచిది. ఈ రోజు వెండి నాణెం కొనుగోలు చేసి దానిని పూజించడం వలన ఇంట్లో ధనలాభం కలుగుతుందంట.

అలాగే వైవాహిక జీవితంలో సమస్యలు గనకు ఉంటే హోలీ పండుగ రోజున మీ ఇంటి బెడ్ రూమ్‌లో రాధా కృష్ణుల ఫొటో పెట్టుకోవడం వలన భార్య భర్తల మధ్య ప్రేమ బలపడుతుందంట. సమస్యలు సమసిపోతాయంటున్నారు పండితులు.

హోలీ రోజున మీ ఇంటి ఆవరణంలో తులసిమొక్కను నాటడం వలన అదృష్టం కలిసి వస్తుందంట. మీ ఇంటి పెద్ద లేదా ఆడపడుచు తులసిమొక్కను మీ ఇంట్లో నాటడం వలన మీ ఇంట ఆనందాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.





























