- Telugu News Photo Gallery Spiritual photos These are the best tips to get rid of the influence of Saturn on this day
ఏలినాటి శని ప్రభావంతో సమస్యలా.. ఈ పరిహారాలు మీ కోసమే!
నవ గ్రహాల్లో ఒక్కటైన శని గ్రహం గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా శక్తివంతమై గ్రహం ఇది. ఇక శని గ్రహం కర్మల ఫలితంగా ఫలితాలను ఇస్తాడటారు. అయితే శని గ్రహం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశి సంచారం చేస్తుంటాడు. ఈ క్రమంలో, ఇది 12 రాశులపై తన ప్రభావం చూపుతుంది. ఇది కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తే మరికొన్ని రాశుల వారికి ప్రతి కూల ఫలితాలను ఇస్తుంది.
Updated on: Nov 18, 2025 | 5:31 PM

2026 వ సంవత్సరంలో శని గ్రహం రాశి సంచారం చేయడం లేదు. శని గ్రహం రాశి మార్పు లేనప్పటికీ, ఇది కొన్ని రాశుల వారికి సమస్యలను తీసుకొస్తుంది. ఎందుకంటే? ఏలి నాటి శని ప్రభావంతో 2026 వ సంవత్సరంలో కొన్ని రాశుల వారు ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అటువంటి సమయంలో శని గ్రహం అనుగ్రహం పొందడానికి తప్పకుండా కొన్ని పరిహారాలు పాటించాలి అంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

నల్ల నువ్వుల దానం : ఎవరైతే ఏలి నాటి శని ప్రభావంతో సమస్యలు ఎదుర్కొంటున్నారో, వారు ప్రతి శని వారం ఉదయం, స్నానం చేసే క్రమంలో నీటిలో నల్లటి నువ్వులు వేసుకొని స్నానం చేయాలంట. అంతే కాకుండా నల్ల నువ్వులను దానం చేయడం వలన కూడా ఏలి నాటి శని ప్రభావం కాస్త తగ్గే ఛాన్స్ ఉందని చెబుతున్నారు పండితులు.

ఏలినాటి శని ప్రభావంతో, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలతో సతమతం అయ్యే వారు శని వారం రోజున శని దేవాలయంలో ఆవ నూనె దానం చేయడం చాలా శుభ ప్రదం అంటున్నారు పండితులు. దీని వలన శని దేవుడి అనుగ్రహం కలిగి, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వంటివ కలుగుతాయంట.

నల్లటి వస్త్రం శని దేవుడికి చాలా ఇష్టం. అయితే 2026వ సంవత్సరంలో ఎవరిపైన అయితే ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుందో, వారు నల్లటి వస్త్రాన్ని పేదలకు దానం చేయడం వలన శని దేవుడి ఆశీస్సులు కలుగుతాయంట. దీని వలన ఏలినాటి శని చెడు ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు పండితులు.

ఇనుప ఉంగరం : ఇనుముకు , శని దేవుడికి ప్రత్యేక సంబంధం ఉంటుంది. అందువలన ఏలినాటి శని ప్రభావంతో సమస్యలు ఎదుర్కునే వారు శని వారం రోజున ఇనుప ఉంగరాన్ని ధరించడం లేదా, ఇనుప ఉంగరాన్ని తయారు చేసి ఆలయంలో సమర్పించడం చాలా మంచిదంట. దీని వలన శని దేవుడు అడ్డంకులను తగ్గించి, మానసిక బలాన్ని అందిస్తాడంట.



