- Telugu News Photo Gallery Spiritual photos The transit of the Sun brings financial benefits and business growth to the four zodiac signs
మరో నాలుగు రోజుల తర్వాత వీరికి పట్టిందల్లా బంగారమే.. చేతినిండా డబ్బే డబ్బు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం, కలయిక అనేది చాలా కామన్. కొన్ని గ్రహాలు నెల రోజులకు ఒకసారి, మరికొన్ని గ్రహాలు ఆరు నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి గ్రహ సంచారం చేస్తుంటాయి. అయితే శక్తి వంతంమైన సూర్య గ్రహం వృశ్చిక రాశిలోకి సంచారం చేయనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహించని లాభాలు చేకూరనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?
Updated on: Nov 12, 2025 | 4:12 PM

నవంబర్ 16న దాదాపు సంవత్సరం తర్వాత సూర్య గ్రహం వృశ్చిక రాశిలోకి సంచారం చేయనుంది. ఇది 12 రాశులపై దాని ప్రభావం చూపగా, నాలుగు రాశుల వారికి మాత్రం ఆర్థికంగా అదృష్టాన్ని తీసుకొస్తుంది. దీని వలన వారికి చేతినిండా డబ్బే డబ్బు.

మిథున రాశి : మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారు ఏ పనులు చేసినా ప్రారంభించినా అవి త్వరగా పూర్తి అవుతాయి. అంతే కాకుండా, విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు, ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు, విద్యార్థులకు, కళా రంగంలో ఉన్నవారు అత్యధిక లాభాలు అందుకొని చాలా సంతోషంగా ఉంటారు.

కుంభ రాశి : కుంభ రాశి వారికి పెండింగ్‌లో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే సొంత వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటారో వారి పనులు పూర్తి అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రాశి వారు వ్యాపారంలో అత్యధిక లాభాలు సొంతం చేసుకొని, చాలా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరి కలలు చాలా త్వరగా నెరవేరే ఛాన్స్ ఉంది. మఖ్యంగా వీరి సంపద ఊహించని విధంగా రెట్టింపు అవుతుంది. అలాగే పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి కూడా ఇది చాలా మంచి సమయం.

మకర రాశి : మకర రాశి వారికి అద్భుతంగా ఉండనుంది. వీరిపై సూర్య గ్రహం అనుగ్రహం ఎక్కువగా ఉండటం వలన వీరికి ఖర్చులు తగ్గడమే కాకుండా, ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. అంతే కాకుండా ఈ రాశి వారి బ్యాంకు బ్యాలెన్స్ విపరీతంగా పెరగడంతో వీరు చాలా ఆనందంగా గడుపుతారు. అంతే కాకుండా వీరికి ఉద్యోగంలో ప్రమోషన్ కూడా రావడంతో చాలా ఆనందంగా గడుపుతారు.



