- Telugu News Photo Gallery Spiritual photos These are the zodiac signs that earn the most money due to the blessings of the planet Mercury
ఏదేమైనా వీరిది మాములు అదృష్టం కాదు.. ఊహించినదానికంటే ఎక్కువే సంపాదిస్తారు
జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యతనే వేరు. బుధ గ్రహాన్ని వ్యాపారం, కమ్యూనికేషన్, తెలివితేటలకు అధిపతిగా కొలుస్తారు. ఎవరి జాతకంలోనైతే బుధ గ్రహం బలంగా ఉంటుందో, వారు వ్యాపారంలో ముందు ఉండటమే కాకుండా, ఆర్థికంగా కూడా చాలా దృఢంగా ఉంటారు.
Updated on: Nov 12, 2025 | 4:11 PM

బుధ గ్రహం చాలా చిన్న గ్రహం అయినప్పటికీ దీనికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అంతే కాకుండా బుధ గ్రహం ఏ రాశి వారిలోనైతే శుభ స్థానంలో ఉంటుందో వారు అత్యధిక తెలివితేటలతో గొప్ప గొప్ప విజయాలను అందుకుంటారు. ఇక బుధ గ్రహం రాశి సంచారం కాకుండా, నక్షత్ర సంచారం కూడా చేస్తుంది. అయితే అతి త్వరలో బుధ గ్రహం నక్షత్ర సంచారం చేయనుంది. దీంతో కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

మిథున రాశి : మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. అంతే కాకుండా వీరు అనుకోని మార్గాల ద్వారా ఎక్కువ ఆదాయం పొందుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

కన్యా రాశి : కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. బుధ గ్రహం అనుగ్రహం, బుధుడి నక్షత్ర సంచారం వలన వీరి ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. అనుకోని లాభాల ద్వారా వీరు కొత్త బిజినెస్‌లు స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. అనుకోని విధంగా ఆదాయం చేతికందడంతో, చాలా ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు కొత్త వ్యాపారం ప్రారంభించే ఛాన్స్ ఉంది.

మేష రాశి : మేష రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదిస్తారు. ఈ రాశి వారు తీర్థయాత్రలు చేసి చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అనుకోని విధంగా డబ్బు చేతికందుతుంది. వీరు చాలా ఆనందంగా గడుపుతారు.

కర్కాటక రాశి : కర్కాటక రాశిలో ఉన్నవారికి బుధుడి అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా, వీరు ఎప్పుడూ సానుకూల ఫలితాలను పొందుతూ, అన్నింట్లో విజయం సాధిస్తారు. ఈ రాశి వారు అతి త్వరలో కొత్త ఇళ్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది.



