- Telugu News Photo Gallery Spiritual photos Surya Grahan 2024: October Eclipse to have positive Impact on these Zodiac Signs
Solar Eclipse 2024: సూర్య గ్రహణంతో వారికి అంతా శుభమే! మీ రాశికి ఎలా ఉందంటే..
Surya Grahan 2024: అక్టోబర్ 2వ తేదీన కన్యా రాశిలో చోటు చేసుకుంటున్న సూర్య గ్రహణం వల్ల సగం రాశులకు శుభమే జరగబోతోంది. ఈ సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించే అవకాశం లేనప్పటికీ, కన్యా రాశిలో రవి, చంద్ర, కేతువులు కలవడం వల్ల జాతక చక్రంలో మాత్రం గ్రహణ ఫలితాలు కలుగుతాయి. గ్రహణ ప్రభావం వల్ల ..
Updated on: Sep 27, 2024 | 6:26 PM

అక్టోబర్ 2వ తేదీన కన్యా రాశిలో చోటు చేసుకుంటున్న సూర్య గ్రహణం వల్ల సగం రాశులకు శుభమే జరగబోతోంది. ఈ సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించే అవకాశం లేనప్పటికీ, కన్యా రాశిలో రవి, చంద్ర, కేతువులు కలవడం వల్ల జాతక చక్రంలో మాత్రం గ్రహణ ఫలితాలు కలుగుతాయి. గ్రహణ ప్రభావం వల్ల మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశులకు దాదాపు పదిహేను రోజుల పాటు యోగ కాలంగా కనిపిస్తోంది.

మేషం: ఈ రాశికి ఆరవ స్థానంలో సూర్య గ్రహణం ఏర్పడుతున్నందువల్ల శత్రు, రోగ, రుణ బాధల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెంది ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంటుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. వాయిదా పడుతున్న విహార యాత్రలు పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది.

కర్కాటకం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో గ్రహణం పడుతున్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉండ వచ్చు. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకుపోతాయి. ప్రయాణాల వల్ల లాభం కలుగు తుంది. సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో వివాదాలు, విభేదాలు సమ సిపోతాయి. ప్రణాళిక ప్రకారం వ్యవహరించి ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు.

సింహం: ఈ రాశికి ధన స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనుకోకుండా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు ఆశించిన దానికంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగి, నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధుమిత్రులు మీ సలహాల వల్ల లబ్ధి పొందుతారు.

వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో రవి, చంద్ర, కేతువులు కలవడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి రావలసిన డబ్బు, బాకీలు వసూలవుతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి సంబంధించిన ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

ధనుస్సు: ఈ రాశికి దశమ స్థానంలో గ్రహణం పడుతున్నందువల్ల ఉద్యోగంలో ఎటువంటి సమస్యలున్నా సానుకూలంగా పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు కూడా క్రమంగా నష్టాల నుంచి బయట పడి లాభాల బాటపడతాయి. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అంది వస్తాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగు తాయి. లాభదాయక పరిచయాలు పెంపొందుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది.

కుంభం: ఈ రాశికి అష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతున్నందువల్ల రావలసిన సొమ్ము, బాకీలు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతాయి. అనేక మార్గాల్లో బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వారసత్వపు ఆస్తి సంక్రమిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఉద్యో గంలో శక్తి సామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పలుకుబడి గల కుటుంబంతో పెళ్లి నిశ్చయం అవుతుంది.



