- Telugu News Photo Gallery Spiritual photos October 2024 horoscope these zodiac signs to have big changes in life details in telugu
అక్టోబర్ నెలలో వారి జీవితాల్లో సరికొత్త సంచలనాలు.. అందులో మీ రాశి ఉందా..?
October 2024 Horoscope: అక్టోబర్ లో నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారుతున్నాయి. ఈ మార్పుల వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని సంచలనాలు సంభవించే అవకాశం కూడా ఉంది. ఇందులో బుధుడు అక్టోబర్ 10న, శుక్రుడు 15న, రవి 16న, కుజుడు 21న రాశులు మారడం జరుగుతోంది.
Updated on: Sep 27, 2024 | 6:42 PM

అక్టోబర్ లో నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారుతున్నాయి. ఈ మార్పుల వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని సంచలనాలు సంభవించే అవకాశం కూడా ఉంది. ఇందులో బుధుడు అక్టోబర్ 10న, శుక్రుడు 15న, రవి 16న, కుజుడు 21న రాశులు మారడం జరుగుతోంది. ఈ నాలుగు గ్రహాల మార్పు బాగా అనుకూలంగా ఉండే రాశులు మేషం, మిథునం, కన్య, ధనుస్సు, మకరం, కుంభం. ఉద్యోగంలో ఆకస్మిక పరిణామాలు చోటు చేసుకోవడం, ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ కావడం, అనుకోకుండా జీత భత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చోటు చేసుకోవడం వంటివి జరిగే అవకాశం ఉంది.

మేషం: ఈ రాశికి మిగిలిన గ్రహాలు అనుకూలంగా మారడంతో పాటు రాశ్యధిపతి కుజుడు చతుర్థ స్థానం లోకి ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో పదోన్నతితో కూడిన బదిలీ చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మరింత మంచి ఉద్యోగం మారడానికి కూడా అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు లెక్కకు మించిన ఆఫర్లు అందుతాయి. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఒత్తిడి బాగా తగ్గుతుంది.

మిథునం: రాశ్యధిపతి బుధుడు పంచమ స్థానంలోకి ప్రవేశించడంతో పాటు కుజ, రవులు బాగా అనుకూ లంగా మారడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాల్లో కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. సంతాన యోగానికి సంబంధించి కూడా శుభ వార్త వింటారు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు వృద్ధి చెందుతాయి.

కన్య: మూడు గ్రహాలు అనుకూలంగా మారడంతో పాటు రాశినాథుడు బుధుడు ధన స్థానంలోకి ప్రవేశి స్తున్నందువల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. అనేక వైపుల నుంచి ఆదా యం లభిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ధనుస్సు: ఈ రాశికి ఈ నాలుగు గ్రహాల మార్పుతో లాభ స్థానం బాగా పటిష్ఠం అవుతున్నందువల్ల లాభ దాయక పరిచయాలు విస్తరిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. జీతభత్యాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. ఫేర్లు, వడ్డీ వ్యాపారాల మీద మదుపు చేయడం జరుగుతుంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది.

మకరం: నాలుగు గ్రహాల రాశి మార్పుతో దశమ, లాభస్థానాలు బలం పుంజుకోవడంతో ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరగడంతో పాటు అధికార యోగానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు చాలా వరకు నష్టాల నుంచి బయటపడడం జరుగుతుంది. నిరుద్యోగులకు, అవివాహితులకు విదేశీ అవకాశాలు అందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆస్తి వివాదం అనుకూలిస్తుంది.

కుంభం: ఈ రాశికి అక్టోబర్ నెలంతా భాగ్య, దశమ స్థానాలు బాగా అనుకూలంగా మారడంతో పాటు, ఆరవ స్థానంలో కుజుడి ప్రవేశం వల్ల ఏ ప్రయత్నమైనా అనుకూలంగా నెరవేరడం జరుగుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నంలో విదేశీ సంబంధం ఖాయమవుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.



