- Telugu News Photo Gallery Spiritual photos Solar Eclipse 2025: These zodiac signs to have luck and money details in telugu
సూర్య గ్రహణం, గ్రహాల మార్పు.. ఈ రాశుల వారు నక్కతోక తొక్కినట్టే!
Solar Eclipse 2025: ఈ నెల (సెప్టెంబర్) 15 తర్వాత నాలుగు కీలక గ్రహాలు రాశులు మారడంతో పాటు, 21వ తేదీన కొద్దిపాటి సూర్య గ్రహణం కూడా చోటు చేసుకుంటున్నందువల్ల కొన్ని రాశుల మీద ఈ నెలాఖరు వరకు, అంటే పదిహేను రోజుల పాటు వీటన్నిటి ప్రభావం ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. సూర్య గ్రహణం భారతదేశంలో కనబడే అవకాశం లేనందువల్ల దీని ప్రభావం కొద్దిగా మాత్రమే ఉంటుంది. మేషం, వృషభం కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశులకు ఈ గ్రహాల మార్పు, సూర్య గ్రహణం వల్ల దశ తిరిగే అవకాశం ఉంది.
Updated on: Sep 11, 2025 | 7:22 PM

మేషం: ఈ రాశికి రాశ్యధిపతి కుజుడితో సహా నాలుగు గ్రహాలు రాశులు మారడం, గ్రహణం వల్ల జీవితంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. పదోన్నతి, భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగంలోకి మారడానికి ఉద్యోగులకు బాగా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం: ఈ రాశికి నాలుగైదు స్థానాల్లో గ్రహాల మార్పు జరగడంతో పాటు గ్రహణ ప్రభావం వల్ల రాజ పూజ్యాలు కలుగుతాయి. ప్రభుత్వమూలక గుర్తింపు లభిస్తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పిల్లలు బాగా వృద్ధి లోకి వస్తారు. సంతాన ప్రాప్తికి సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభించే అవకాశం ఉంది.

కర్కాటకం: గ్రహాల మార్పుతో తృతీయ స్థానం బలపడుతున్నందువల్ల ఏ కొద్ది ప్రయత్నం చేపట్టినా విజయం సాధించడం జరుగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడి ఆర్థిక లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలను కొద్దిపాటి మార్పులతో కొత్త పుంతలు తొక్కిస్తారు. ఆస్తి కలిసి వస్తుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది.

వృశ్చికం: నాలుగు గ్రహాల మార్పుతో పాటు, గ్రహణ ప్రభావం కూడా లాభ స్థానంలో బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల కొన్ని సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. ఆస్తి, ఆర్థిక వ్యవ హారాలు సంతృప్తికరంగా, సానుకూలంగా సాగిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్మును, బాకీలను రాబట్టుకుంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఇంట్లో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది.

ధనుస్సు: ఈ రాశికి దశమ స్థానంలో గ్రహాల మార్పు, గ్రహణం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి ఆఫర్లు అందుతాయి. కోరుకున్న ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో అన్ని విధాలా ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయానికి లోటుండదు.

మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో గ్రహాల మార్పు వల్ల శుభవార్తలు ఎక్కువగా వినే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన ప్రాప్తికి సంబంధించి శుభవార్త వింటారు. వారసత్వ సంపద లభిస్తుంది. భూలాభం కూడా కలుగుతుంది.



