- Telugu News Photo Gallery Spiritual photos Shani Shukra Yuti These zodiac signs to have good days just before new year 2025 details in telugu
Lord Shani: శుక్ర, శనుల యుతి.. న్యూ ఇయర్ ముందు నుంచే వారికి సుఖ సంతోషాలు
Lord Shani Dev: ఈ నెల 28న శుక్రుడు కుంభ రాశిలో సంచారం ప్రారంభించడం జరుగుతోంది. శనీశ్వరుడికి చెందిన కుంభ రాశి శుక్రుడికి మిత్ర రాశి అయినందువల్ల ఇక్కడ శుక్రుడు రెట్టింపు శుభ ఫలితాలనిస్తాడు. సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు మిత్రక్షేత్రంలో సంచారం చేయడం వల్ల మేషం, వృషభం, మిథునం, తుల, మకరం, కుంభ రాశుల వారికి అనేక విధాలుగా సుఖ సంతోషాలు వృద్ధి చెందబోతున్నాయి. ఒక నెల రోజుల పాటు జీవితం నిత్య కల్యాణం, పచ్చ తోరణంలా సాగిపోతుంది. శని దోషం వల్ల ఇబ్బంది పడుతున్నవారికి ఈ దోషం నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది.
Updated on: Dec 15, 2024 | 6:27 PM

మేషం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర, శనులు యుతి చెందడం వల్ల ఇబ్బడిముబ్బడిగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉన్నత వర్గాలతో సాన్నిహిత్యం పెరుగు తుంది. ఉద్యోగంలో పదోన్నతికి, వేతనాల పెరుగుదలకు మార్గం సుగమం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు కష్టనష్టాల నుంచి పూర్తిగా బయటపడతాయి. రావలసిన డబ్బు వసూలు కావడంతో ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం ఖాయమవుతుంది.

వృషభం: రాశినాథుడైన శుక్రుడు దశమాధిపతి శనిని దశమ స్థానంలో కలవడం వల్ల ఈ రాశివారికి శశ మహా పురుష యోగం ఏర్పడింది. దీనివల్ల సమాజంలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభించి పలుకుబడి బాగా పెరుగుతుంది. కీర్తి ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందు తుంది. ఉద్యోగంలో రాజయోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మహా భాగ్య యోగాలు కలుగుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.

మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల విదేశీయానానికి, విదేశీ ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరు ద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. వారసత్వ సంపద లభించే అవ కాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభి స్తాయి. సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నత వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి.

తుల: రాశ్యధిపతి శుక్రుడు పంచమ స్థానంలో శనిని కలవడం వల్ల రాజయోగాలు కలుగుతాయి. ప్రము ఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులను పొందడం జరుగు తుంది. జీతభత్యాలు అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభానికి బాగా అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా దూసుకుపోతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి.

మకరం: ఈ రాశికి ధన స్థానంలో శని, శుక్రుల యుతి జరగడం వల్ల ఊహించని స్థాయిలో ధన బలం కలు గుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించడం వంటివి జరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఉత్సా హంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. కుటుంబంలో ఒకటి రెండు శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది.

కుంభం: ఈ రాశిలో శని, శుక్రుల యుతి జరుగుతున్నందువల్ల ఒక నెల రోజుల పాటు ఏలిన్నాటి శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది. పని భారం తగ్గడం, ఆదాయం బాగా పెరగడం, అనారోగ్యాల నుంచి కోలుకోవడం, ఉద్యోగంలో గుర్తింపు లభించడం వంటివి తప్పకుండా జరుగుతాయి. సమా జంలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ప్రభుత్వ మూలక ధనలాభం కూడా కలుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది.



