- Telugu News Photo Gallery Spiritual photos Shani Guru Retrograde Brings Rajayogam and Dhanayogam for 5 Zodiac Signs
Wealth – Career Boost: గురు, శనుల వక్రగతి…ఈ రాశులకు ఆకస్మిక రాజయోగాలు, ధన యోగాలు!
ప్రస్తుతం శనీశ్వరుడు మీన రాశిలో వక్రించి ఉన్నాడు. ఈ నెల(నవంబర్) 12 నుంచి కర్కాటకంలో ఉచ్ఛ గురువు వక్రగతి కూడా ప్రారంభం అవుతుంది. నవంబర్ 28 వరకు ఈ రెండు ప్రధాన గ్రహాల వక్ర గతి కొనసాగుతుంది. ఈ వక్ర గతి వల్ల సాధారణంగా ఆకస్మిక పరిణామాలు చోటు చేసుకోవడం. గ్రహాలు చురుకుగా వ్యవహరించి తాము ఇవ్వవలసిన ఫలితాలను బాగా ముందుగా ఇవ్వడం వంటివి జరుగుతాయి. కొన్ని రాశుల వారి జీవితాలు, జీవనశైలి సమూలంగా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ రెండు గ్రహాల వక్రగతి వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మకర రాశులకు తప్పకుండా ఆకస్మిక రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి.
Updated on: Nov 04, 2025 | 7:06 PM

వృషభం: ఈ రాశికి శని, గురువుల వక్రగతి వల్ల జీవనశైలిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. అపర కుబేరులయ్యే సూచనలున్నాయి. ఆదాయ వృద్ధికి చేపట్టే ప్రయత్నాలన్నీ బాగా కలిసి వస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అదనపు ఆదాయ మార్గాలన్నీ ఊహించని లాభాలనిస్తాయి. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. విలాస జీవితం అలవడుతుంది. ఒక సమాజ సేవకుడుగా మారే అవకాశం ఉంది. ఆరోగ్య లాభం కలుగుతుంది.

మిథునం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న గురువు, ఉద్యోగ స్థానంలో ఉన్న శని వక్రించడం వల్ల అనుకో కుండా ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా ఇతర దేశాలకు ఎక్కువగా వెళ్లడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన అవసరాలు పూర్తిగా తీరిపోతాయి.

కర్కాటకం: ఈ రాశిలో ఉచ్ఛలో ఉన్నగురువు, భాగ్య స్థానంలో ఉన్న శనీశ్వరుడు వక్రించడం వల్ల విదేశీయానానికి, విదేశీ అవకాశాలకు ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి, భూలాభాలు కలుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో ఉన్న శని, దశమ స్థానంలో ఉన్న గురువు వక్రించడం వల్ల కెరీర్ పరంగా కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. అనేక విధాలుగా ప్రాధాన్యం పెరుగుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి బాగా అవకాశం ఉంది. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు అంది వస్తాయి. ఆర్థికంగా, ఆస్తి పరంగా స్థాయి పెరుగుతుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

మకరం: రాశ్యదిపతి శని తృతీయ స్థానంలో, గురువు సప్తమ స్థానంలో వక్రించడం వల్ల ఈ రాశివారికి మహా భాగ్య యోగాలు, రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కుదరడం జరుగుతుంది.



