- Telugu News Photo Gallery Spiritual photos Retrograde Jupiter Boosts Luck, Wealth and Career for these zodiac signs Telugu Astrology
Lucky Zodiacs: గురు దృష్టితో ఈ రాశుల వారికి అదృష్టం పట్టడం ఖాయం..!
Telugu Astrology: ఈ నెల (నవంబర్) 12వ తేదీ నుంచి డిసెంబర్ 5 వరకు గురువు తనకు ఉచ్ఛ స్థానమైన కర్కాటక రాశిలో వక్రించడం జరుగుతోంది. వక్రించిన గురువు కుజ, శనులను వీక్షించడం వల్ల ఈ రెండు పాప గ్రహాలు శుభ గ్రహాలుగా మారి కొన్ని రాశులకు యోగదాయకంగా మారే అవకాశం ఉంది. గురు దృష్టి ఈ గ్రహం మీద పడినా ఆ గ్రహం శుభ ఫలితాలను మాత్రమే ఇస్తుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ వక్ర గురు దృష్టి ఫలితంగా మేషం, మిథునం, సింహం, ధనుస్సు, మీన రాశుల వారు కూడా ఉన్నతస్థాయి యోగాలను అనుభవించే అవకాశం ఉంది.
Updated on: Nov 12, 2025 | 5:52 PM

మేషం: ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు వక్రించి కుజ, శనులను వీక్షిస్తున్న కారణంగా ఈ రాశివారికి ఏలి న్నాటి శని దోషం నుంచి, అష్టమ కుజ దోషం నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆదాయ ప్రయ త్నాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరిగి విదేశీ ఆఫర్లు కూడా అందడం జరుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఎక్కువగా శుభవార్తలు అందుతాయి.

మిథునం: ఈ రాశికి ద్వితీయ స్థానం నుంచి ఉచ్ఛ గురువు దశమ శనిని, షష్ట కుజుడిని వీక్షించడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో పట్టపగ్గాలుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది.

సింహం: ఈ రాశికి అష్టమ స్థానంలో ఉన్న శని మీదా, చతుర్థ స్థానంలో ఉన్న కుజుడి మీదా ఉచ్ఛ గురువు దృష్టి పడడం వల్ల ఈ రాశివారికి శని, కుజ దోషాలు పూర్తిగా తొలగిపోయి, ఆటంకాలు, అవరోధాలు మటుమాయం కావడమే కాకుండా సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ యోగం పడుతుంది.

ధనుస్సు: రాశ్యధిపతి గురువు ఉచ్ఛపట్టి, వక్రించి శని కుజులను చూడడం వల్ల ఈ రాశివారికి అర్ధాష్టమ శని దోషం నుంచి, కుజ దోషం నుంచి పూర్తిగా విముక్తి కలుగుతుంది. ఉద్యోగంలో పదవీ యోగం పడుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తి లాభం, భూ లాభం కలుగుతాయి. కొద్ది ప్రయత్నంతో సంపద బాగా వృద్ధి చెందుతుంది. ఇంట్లో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జరుగుతాయి. రావలసిన సొమ్ము, మొండి బాకీలు వసూలవుతాయి.

మీనం: ఈ రాశిలో సంచారం చేస్తున్న శనిని, భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న కుజుడిని రాశ్యధిపతి గురువు వీక్షించడం వల్ల ఏలిన్నాటి శని దోషం నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందుతాయి. విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. విదేశాల్లో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. సంతాన యోగం కలుగుతుంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. సంపన్న కుటుంబంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.



