- Telugu News Photo Gallery Spiritual photos Rashi Parivartan: Big Fortunes for 5 Zodiac Signs Telugu Astrology
Luck and Fortune: పరివర్తన యోగం.. ఈ రాశుల వారికి మహర్దశ పట్టబోతోంది..!
Parivartan Yoga: జ్యోతిషశాస్త్రం ప్రకారం శుభ గ్రహాల మధ్య రాశి పరివర్తన జరిగినప్పుడు తప్పకుండా జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వాటి ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది. పరివర్తన సమయంలో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలు సమీప భవిష్యత్తులో తప్పకుండా విజయవంతం అవుతాయి. ఈ నెల(నవంబర్) 22, 23, 24 తేదీల్లో గురు, చంద్రుల మధ్య జరుగుతున్న రాశి పరివర్తన కూడా ఈ కోవకు చెందినదే. చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో గురువు ఉచ్ఛపట్టి ఉండడం, గురువుకు చెందిన ధనూ రాశిలో చంద్రుడి సంచారం పరివర్తన యోగానికి అవకాశం ఇస్తోంది. దీని వల్ల మేషం, మిథునం, కన్య, వృశ్చికం, మీన రాశులు లబ్ధి పొందబోతున్నాయి.
Updated on: Nov 17, 2025 | 8:09 PM

మేషం: ఈ రాశికి చతుర్థ, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల కాహళ యోగమనే అరుదైన యోగం కూడా కలుగుతోంది. కాహళ యోగమంటే అధికార యోగం. ఉద్యోగులకు అధికార యోగం పడుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. పిత్రార్జితం లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది.

మిథునం: ఈ రాశికి ధన, సప్తమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో భాగస్వాములతో సమస్యలన్నీ పరిష్కారమై, అభివృద్ధి బాట పట్టడం జరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి నిశ్చయం కావడం వంటివి జరుగుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

కన్య: ఈ రాశికి చతుర్థ, లాభాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఆస్తి లాభం కలుగుతుంది. ఆస్తి వివాదాలు బాగా అనుకూలంగా పరిష్కారమవుతాయి. అనేక విధాలుగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. మాతృ సౌఖ్యం కలుగుతుంది. తల్లి కారణంగా లేదా తల్లి వైపు నుంచి ఆస్తిపాస్తులు లభించే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి.

వృశ్చికం: ఈ రాశికి ధన, భాగ్యాధిపతుల మద్య పరివర్తన జరగడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని దాటుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.

మీనం: ఈ రాశికి పంచమ, దశమ స్థానాల మధ్య పరివర్తన జరగడం వల్ల అనేక విధాలైన అదృష్టాలు కలుగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరగడంతో పాటు అధికార యోగం కూడా పడుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు బలపడతాయి. షేర్లు, స్పెక్యులేషన్లలో లాభాల పంట పండుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. లాటరీ వచ్చే అవకాశం కూడా ఉంది.



