- Telugu News Photo Gallery Spiritual photos Budha Gochar: Libra Transit Benefits 5 Zodiac Signs. Details in Telugu
Budha Gochar: తులా రాశిలో బుధుడు..వారి తల రాతలు మారబోతున్నాయ్..!
Mercury Transit in Libra: ప్రస్తుతం వృశ్చిక రాశిలో వక్ర గతిలో సంచారం చేస్తున్న బుధుడు ఈ నెల(నవంబర్) 24 న తిరోగమనం చెంది తులా రాశిలో ప్రవేశిస్తున్నాడు. తనకు మిత్ర క్షేత్రమైన తులా రాశిలో బుధుడు డిసెంబర్ 6 వరకు కొనసాగుతాడు. శుక్రుడికి చెందిన తులా రాశిలో బుధుడి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలు అనుభవానికి రావడంతో పాటు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. మిథునం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారి జీవితాల్లో 12 రోజుల పాటు కలలో కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.
Updated on: Nov 18, 2025 | 12:05 PM

మిథునం: రాశినాథుడు బుధుడు పంచమ స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారికి మనసులోని కోరి కలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా ఘన విజయం సాధిస్తారు. ముఖ్యంగా షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి.

కన్య: రాశ్యధిపతి బుధుడు ఈ రాశికి ద్వితీయ స్థానంలో ప్రవేశించడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సానుకూల ఫలితాలనిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు ఎక్కువగా వెళ్లడం జరుగుతుంది. అధికారులే కాక బంధుమిత్రులు కూడా మీ సలహాలు, సూచనల వల్ల బాగా లబ్ధి పొందుతారు.

తుల: ఈ రాశిలో బుధుడు ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి విదేశీ ఉద్యోగాలు లభిస్తాయి. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. రాజపూజ్యాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. అనారోగ్యాల నుంచి చాలావరకు కోలుకుంటారు. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. తండ్రి వైపు నుంచి సంపద లభిస్తుంది. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది.

ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో బుధ సంచారం వల్ల ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. ఈ రాశివారి సలహాలు, సూచనలు సంస్థకు బాగా లబ్ధి చేకూరుస్తాయి. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం పడుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి కావడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.

మకరం: ఈ రాశికి దశమ స్థానంలో బుధ సంచారం వల్ల ఉద్యోగ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభించడం, జీతభత్యాలు పెరగడం, ఇష్టమైన ప్రాంతానికి బదిలీ కావడం వంటివి జరుగుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరిగి ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.



