- Telugu News Photo Gallery Spiritual photos Pournami Horoscope: 6 Zodiac Signs to Gain Wealth and Success Telugu Astrology
Pournami Horoscope: ఆ రాశుల వారికి పౌర్ణమి వరాలు.. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..!
డిసెంబర్ 4న వృషభ రాశిలో ఏర్పడుతున్న పౌర్ణమి నుంచి ఆరు రాశుల వారి జీవితాల్లో అనేక సానుకూల మార్పుల చోటు చేసుకోబోతున్నాయి. వృషభ చంద్రుడికి సప్తమ స్థానంలో రవి, శుక్ర, బుధుల సంచారం వల్ల తప్పకుండా కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ పరిస్థితి సుమారు 45 రోజుల పాటు కొనసాగుతుంది. మేషం, వృషభం. కర్కాటకం, వృశ్చికం, మకరం, మీనం. ఈ రాశుల వారు జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు. వివిధ రంగాల్లో ఆశించిన విజయాలు సాధిస్తారు. అధికారం, ఆదాయం విషయాల్లో వీరిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి.
Updated on: Nov 28, 2025 | 7:29 PM

మేషం: ఈ రాశివారికి ధన స్థానంలో ఉన్న చంద్రుడిని రాశ్యధిపతి కుజుడితో సహా మూడు గ్రహాలు వీక్షించడం వల్ల జీవితం సానుకూల మలుపులు తిరుగుతుంది. ముఖ్యమైన విషయంలో అదృష్టం తలుపు తడుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. తల్లితండ్రుల నుంచి సంపద లభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో భారీ లక్ష్యాలు, ప్రాజెక్టులు చేపట్టి తమ సమర్థతను నిరూపించుకుంటారు. అనేక విధాలుగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

వృషభం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో గ్రహాలు ఎక్కువ సంఖ్యలో కలుస్తున్నందువల్ల అనేక విధాలుగా సంపద పెరిగే అవకాశం ఉంది. శుభవార్తలు, శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈ నెల 9 తర్వాత తప్పకుండా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అవకాశం ఉంది. వృత్తి జీవితం తిరుగులేని విధంగా సాగిపోతుంది. పుణ్య క్షేత్రాలు, ఇతర పవిత్ర స్థలాలను సందర్శించడం జరుగుతుంది.

కర్కాటకం: ఈ రాశివారికి లాభ స్థానంలో రాశ్యధిపతి చంద్రుడు ఉచ్ఛపట్టడం, దాని మీద మూడు శుభ గ్రహాల దృష్టి పడడం వల్ల జీవితంలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. ఎటువంటి ఆదాయ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో సామరస్యం, అన్యోన్యత బాగా పెరుగు తాయి. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సొంత వ్యాపారం కోసం పెట్టుబడులు అందుతాయి.

వృశ్చికం: ఈ రాశిలో ఉన్న మూడు ముఖ్యమైన గ్రహాలతో ఉచ్ఛ చంద్రుడికి దృష్టి ఏర్పడడం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. రాజయోగాలు, ధన యోగాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్న మైనా కలిసి వస్తుంది. వ్యక్తిగత జీవితాన్ని మరింతగా మెరుగుపరచుకుంటారు. శుభ వార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. అవసరానికి మించిన డబ్బు అందుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఇష్టమైన ప్రాంతాలను సందర్శిస్తారు. విలాస జీవితం గడుపుతారు.

మకరం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న చంద్రుడికి మూడు గ్రహాలతో వీక్షణ ఏర్పడడం వల్ల జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. సమస్యలు, ఒత్తిళ్లు తగ్గిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవితం సానుకూల మలుపులు తిరుగుతుంది. సామాజికంగా గుర్తింపు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి దోహదం చేసే అవకాశాలు అంది వస్తాయి. జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి.

మీనం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో పౌర్ణమి ఏర్పడడం, భాగ్య స్థానం నుంచి మూడు గ్రహాలు దాన్ని వీక్షించడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబడి సంపద పెరుగుతుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక సమస్యలన్నీ చాలావరకు పరిష్కారం అవుతాయి. సామాజికంగా కూడా ఉన్నత హోదా, ఆదరణ లభిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.



