- Telugu News Photo Gallery Spiritual photos Money Astrology: Major Financial Turnaround for 6 Rasis by Favorable Planets
శుభ గ్రహాలతో పాటు శనీశ్వరుడి ఆశీస్సులు.. ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి!
శుభ గ్రహాలైన గురు, శుక్ర, బుధులతో పాటు శనీశ్వరుడు కూడా బాగా అనుకూలంగా మారబోతున్నందువల్ల కొన్ని రాశుల వారి జీవితం రెండు నెలల్లో ఒక కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా జనవరి పూర్తయ్యేలోగా ఆదాయం అంచనాలకు మించి పెరగడం, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి కలగడం జరగబోతోంది. వృషభం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి సరికొత్త జీవితం అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. తరచూ శివార్చన చేయించడం లేదా విష్ణు సహస్ర నామం పఠించడం వల్ల వీరు ఎక్కువగా శుభ ఫలితాలనే అనుభవించడం జరుగుతుంది.
Updated on: Nov 28, 2025 | 7:06 PM

వృషభం: ఈ రాశివారికి శని, గురువులతో పాటు బుధ, శుక్రులు కూడా బాగా అనుగ్రహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక బలాన్ని బాగా పెంచే అవకాశం ఉంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే సూచనలున్నాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆర్థికంగా ఎలాంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది.

మిథునం: ఈ రాశిలో గురు సంచారం, రాశ్యధిపతి బుధుడు, పంచమాధిపతి శుక్రుడు బాగా అనుకూలంగా ఉండడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి లోగా ఆర్థిక సమస్యలన్నిటి నుంచి విముక్తి లభించే సూచనలున్నాయి. ఆర్థిక అవసరాల నుంచి బయటపడ తారు. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. రావలసిన సొమ్ము పూర్తిగా వసూలవుతుంది. అధికార యోగం కూడా పడుతుంది.

కర్కాటకం: ఈ రాశికి శనితో సహా బుధ, శుక్ర గ్రహాలు రెండూ బాగా లాభించబోతున్నాయి. ఆదాయ వృద్ధి ఆగకపోవచ్చు. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. ఉద్యోగంలో జీత భత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడం జరుగుతుంది. రుణ సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు, ఒప్పం దాలు ఏర్పడతాయి. విలువైన ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆరోగ్య లాభం కూడా కలుగుతుంది.

తుల: ఈ రాశికి ధనస్థానంలో బుధ, శుక్రుల సంచారం, భాగ్య స్థానంలో గురు సంచారం వల్ల ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. వడ్డీ వ్యాపారాలు, లాటరీలు, షేర్లు, స్పెక్యు లేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది.

ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో రాహువు సంచారం జరుగుతున్నంత కాలం ఆదాయానికి లోటుండదు. బుధ, శుక్రులు కూడా బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల బ్యాంక్ నిల్వలు బాగా వృద్ది చెందే అవకాశం ఉంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగా బలం పెరుగుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు. ఇతరత్రా కూడా సంపాదనకు లోటుండకపోవచ్చు. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లన్నీ చాలావరకు పరిష్కారం అవుతాయి.

కుంభం: ఈ రాశివారికి ధన స్థానంలో ధనాధిపతి శనీశ్వరుడు, పంచమ స్థానంలో గురువు, లాభ స్థానంలో శుక్ర, బుధుల సంచారం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆదాయం క్రమంగా పెరగడం తప్ప తగ్గడం ఉండదు. క్రమంగా ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో అధికార యోగంతో పాటు ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. తల్లితండ్రుల నుంచి ఆస్తి లభిస్తుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది.



