- Telugu News Photo Gallery Spiritual photos Naga Panchami 2025, check most powerful naga temples in india which remove kaal sarp dosh
Naga Panchami: దేశంలో మహిమాన్విత నాగ దేవతాలయాలు ఇవే.. ఒక్కసారి దర్శించుకున్నా నాగ దోషం, కాల సర్పదోష నివారణ
హిందువులు మొక్కలు, జంతువులు , పాములు సహా అనేక జీవులను దేవతా స్వరూపంగా భావించి పూజిస్తారు. పాములను పూజించే సంప్రదాయం అనాదిగా వస్తుంది. అందుకనే నేటికీ పాములను చూసినా వాటికీ హాని కలిగించకుండా వాటికీ దూరంగా వెళ్ళిపోయేవారు కూడా ఉన్నారు. తెలిసి తెలియక పాముకి చేసే హాని.. కాల సర్ప దోషంగా మారి జీవితాన్ని తలకిందులు చేస్తుందని నమ్మకం. శ్రీ మహా విష్ణు తల్పం శేషుడు, శివుడి మేడలో వాసుకీ కూడా సర్పజాటికి చెందినవే. ఈ నేపధ్యంలో నాగులను శ్రావణ మాసంలోని పంచమి, కార్తీక మాసంలోని చవితిని పుజిస్తారు. ఈ నేపధ్యంలో మన దేశంలో శక్తివంతమైన నాగ దేవత ఆలయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
Updated on: Jul 24, 2025 | 3:47 PM

శ్రావణ మాసంలోని శుక్ల పక్షం పంచమి తితిని నాగపంచమిగా జరుపుకుంటారు. హరిహరులతో పాటు సుబ్రహ్మణ్యుడికి ఇష్టమైన సర్పాలను ఈ రోజున పూజించడం వలన కాల సర్పదోషం తొలగిపోతుందని నమ్మకం. అంతేకాదు నాగ పంచమి రోజు పుట్టలో పాలు పోసి నాగేంద్రుడిని తమ కుటుంబాన్ని సుఖ సంతోషాలతో జీవించే విధంగా చూడమని కోరుకుంటారు. మన దేశంలో శివ, గణపతి, హనుమాన్, అమ్మవారి సహా అనేక దేవీ దేవతల ఆలయాలతో పాటు నాగదేవత ఆలయాలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క ఆలయాన్ని దర్శించుకున్న సుభ్రమన్యస్వామి అనుగ్రహం మీ సొంతం అంతేకాదు నాగుల దయతో నాగ దోషం, కాలసర్పదోషాల నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంది.

కేరళలోని హరిపాడు అటవీ ప్రాంతంలో నెలకొని ఉన్న మన్నరసాల శ్రీ నాగరాజ దేవాలయం కూడా ప్రసిద్ధి చెందిన నాగదేవతాలయం. ఇక్కడ వేల సంఖయలో జంట నాగుల ప్రతిమలు 30,000 కంటే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ పూజారిగా ఓ మహిళ ఉంటుంది. ఈ ఆలయంలో పూజలు చేయడం వలన కాలసర్పదోషాలు తొలగిపోతాయట. నాగ పంచమి రోజున ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగుతుందని నమ్ముతారు.

మధ్య ప్రదేశ్ లోని పద్మశేష్ పచ్మరిలో శ్రీ నాగద్వార్ స్వామి దేవాలయం ఉంది. శ్రీ నాగద్వార్ స్వామి దేవాలయం పద్మశేష్ పచ్మరిలో ఉంది. ఈ ఆలయం పూర్వకాలంలో నాగులు నివసించేవి అని చెబుతారు. అందుకనే ఈ ప్రదేశం ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనదని నమ్మకం. నాగ దేవతల నివాస స్థలంలో నేటికీ అప్పుడప్పుడు సర్పాలు కనిపిస్తాయని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ నాగ పంచమి రోజున మాత్రమే కాదు విశేషమైన పండగ ల సమయంలో పూజ చేయించుకుంటే జాతకంలో నాగ దోషం సహా ఎలాంటి దోషం ఉన్నా తొలగిపోతుందని నమ్మకం.

తమిళనాడులోని కుంభకోణం సమీపంలో తిరునాగేశ్వరం అనే గ్రామంలో శివునికి అంకితం చేయబడిన ఆలయం ఉంది. దీనిని నాగనాథర ఆలయం రాహు స్తలం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని 7 వ శతాబ్దంలో నిర్మించారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయంలో అనేక ఉపాలయాలున్నాయి. ఇందులో నాగనాథర, రాహు, పిరైసూడి అమ్మన్ అత్యంత ప్రముఖమైనవి.

గుజరాత్‌లోని కచ్ జిల్లాలో భుజ్ పట్టణంలో ఉన్న ఒక కొండపై నిర్మించిన భుజియా కోట పట్టణానికి అభిముఖంగా ఉంది. ఇక్కడ గుహాలో ప్రసిద్ధమైన నాగ ఆలయం ఉంది. ఇక్కడ ఆలయంకు వెళ్లడం ఎంతో సాహాసంతో కూడుకున్నదని చెప్పవచ్చు.

దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న కుక్కే సుబ్రమణ్య స్వామి ఆలయం సుబ్రహ్మణ్య స్వామి భక్తులకు అత్యంత పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. ఇక్కడ సుభ్రమణ్య స్వామి స్వయంభూగా వెలిసాడని నమ్మకం. వాసుకి సహా ఇతర సర్పాలు గరుడుడి బారిన పడినప్పుడు ఆ సర్పాలు సుబ్రహ్మణ్యుని దగ్గర ఆశ్రయం పొందాయని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈ ఆలయం కాలసర్పదోష నివారణకు ప్రసిద్ధిగాంచింది.

తమిళనాడులో నాగరాజ ఆలయం ఉంది. దీనిని 12 వ శతాబ్దంలో నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయంలో మూడు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. పురాతన ప్రధాన మందిరంలో ప్రధాన దైవంగా నాగరాజు పూజలను అందుకుంటున్నాడు. రెండవ మందిరం రుక్మిణి, సత్యభామలతో కూడిన అనంత కృష్ణ (చుట్టిన పాముపై నృత్యం చేస్తున్న శిశువు కృష్ణుడు )కి అంకితం చేయబడింది. మూడవ మందిరం శివునికి అంకితం చేయబడింది.




