వాస్తు టిప్స్ : స్టడీ రూమ్‌లో తప్పక ఉండాల్సిన ఫొటోస్ ఇవే!
వాస్తు శాస్త్రం ప్రకారం స్టడీ రూమ్‌లో తప్పక కొన్ని ఫోటోలు ఉండాలని చెబుతున్నారు వాస్తు నిపుణులు. చాలా మంది స్టడీ పరంగా వెనకబడి పోతుంటారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారు, ఎంత హార్డ్ వర్క్ చేసినా సరైన ఫలితం ఉండదు. అయితే అలాంటి వారు తప్ప తమ స్టడీరూమ్‌లో ఉన్న వాస్తు దోషాలను సవరించుకోవాలంట. కొన్ని ఫొటోలను స్టడీ రూమ్‌లో పెట్టుకోవడం వలన సానుకూల ఫలితాలు వస్తాయంట. కాగా, ఆ ఫొటోస్ ఏవో ఇప్పుడు చూద్దాం.
Updated on: Jul 24, 2025 | 3:10 PM

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రత్యేకత గురించి ఎంత చెప్పినా తక్కువే. వాస్తు నియమాలను సరిగ్గా పాటించినప్పుడే, చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారని చెబుతున్నారు నిపుణులు. కానీ కొంత మంది వాస్తు నియమాలు పాటించకుండా చాలా సమస్యలు ఎదుర్కుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, విద్యార్థులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఎలాంటి వాస్తు టిప్స్ పాటించాలో ఇప్పుడు చూద్దాం.

Study వాస్తు శాస్త్రం ప్రకారం, జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీ మాత పోస్టర్ తప్పకుండా తరగతి గదిలో ఉండాలంట. ఎందుకంటే? సరస్వతీ దేవి ప్రశాంతత, క్రమశిక్షణ సంకేతం. స్టడీ టేబుల్ ముందు లేదా స్టడీ రూమ్‌లో తూర్పు దిశకు గోడపై సరస్వతీ దేవి ఫొటో ఉంచడం వలన జ్ఞానం లభిస్తుందంట. చదువుపై శ్రద్ధ పెరుగుతుందని చెబుతున్నారు పండితులు.Room Vasthu Tips2

అలాగే స్టడీరూమ్‌లో తప్పకుండా, వినాయకుడి ఫొటో ఉండాలంట. వినాయుకుడు అంటే విజ్ఞాలను తొలిగించేవాడు. తేలివితేటకు చిహ్నం. ఈయన ఫొటో స్టడీ రూమ్‌లో ఉండటం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెబుతున్నారు పండితులు. అయితే స్టడీ హాల్‌లో గణేశుడి విగ్రహాన్ని ఈశాన్య గోడపై, పెట్డడం చాలా మంచిదంట.

పర్వతాలు, నదులు లేదా పచ్చని ప్రకృతి దృశ్యాల పోస్టర్లు మనసుకు హాయినిస్తాయి. అలాగే మానసిక ప్రశాంతతను పెంచుతాయి. అందుకే స్టడీ రూమ్‌లో తప్పకుండా పర్వతాలు,నదులు, ప్రకృతికి సంబంధించిన పోస్టర్లు పెట్టుకోవాలంట. ఇది చాలా మంచిదని చెబుతున్నారు పండితులు. వీటిని స్టడీ రూమ్‌లో ఉత్తర దిశగా పెట్టుకోవడం వలన గదిలోకి పాజిటివ్ ఎనర్జీవస్తుందంట.

అలాగే స్టడీరూమ్‌లో మంచి కొటేషన్స్ ఉన్న పోస్టర్స్ పెట్టుకోవాలంట. స్ఫూర్తిదాయకమైన కోట్‌లతో కూడిన సాధారణ పోస్టర్‌లు లేదా ఓపెన్ బుక్స్, ఇంక్ పెన్నులు లేదా జ్ఞాన వృక్షం వంటి చిహ్నాలు పెట్టుకోవడం చాలా మంచిదంట. ఇవి మీ కంటికి విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా, మీ లక్ష్యాలను, ఆశయాలను గుర్తు చేస్తుంటాయి.



