- Telugu News Photo gallery Spiritual photos Mystery temple: The 'magnetic' pull of Uttarakhand hilltop hamlet, Kasar Devi
Kasar Devi Temple: ఈ ఆలయానికి చెందిన రహస్యాన్ని నాసా కూడా ఛేదించలేదు.. ధ్యానం చేసుకోవానికి బెస్ట్ ప్లేస్..ఎందుకంటే
ఉత్తరాఖండ్‌లోని ఈ ఆలయానికి ప్రత్యేకమైన రహస్యం ఉంది. ఇక్కడ ఉన్న రహస్యాన్ని కనిపెట్టడానికి ఏకంగా నాసా శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. కానీ ఆ మిస్టరీని కనిపెట్టలేక ఖాళీగా తిరిగి రావాల్సి వచ్చింది
Updated on: Dec 14, 2022 | 8:09 PM

ఈ ఆలయం సమస్త భూమండలంలో చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతం అపారమైన భూ అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంది. దీనికి కారణం ఈ ఆలయం వాన్ అలెన్ బెల్ట్ కింద వస్తుంది. ఈ బెల్ట్ ఏర్పడటానికి గల కారణాలను నాసా పరిశోధించింది.

ఉత్తరాఖండ్ అందమైన రాష్ట్రం గురించి దేశం మొత్తానికి తెలుసు. అంతేకాదు ఈ రాష్ట్రంలో అందమైన సరస్సులు, ఆలయాలున్నాయి. వాటిల్లో ఒకటి ఈ రహస్యమైన ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి సెలబ్రెటీల సహా దేశ విదేశాల నుంచి అనేకమంది వస్తారు. ఈ దేవాలయం కాసర్ దేవి ఆలయం. ఈ ఆలయం ప్రత్యేకమైన అయస్కాంత క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

ఉత్తరాఖండ్ అల్మోరా-బాగేశ్వర్ హైవే నుండి కు 5 కి. మీ. ల దూరంలో కాసర్ దేవి టెంపుల్ ఒక శిఖరం అంచున ఒక కొండపై ఉంది. ఈ ఆలయాన్ని 2 వ శతాబ్దం లో నిర్మించినట్లు తెలుస్తోంది. ఇతిహాసం మేరకు స్వామి వివేకానంద ఈ ప్రదేశం లో కొంత కాలం ధ్యానం చేసారని చెపుతారు.

భారతదేశంలోని దేవభూమిగా ప్రసిద్ధి చెందిన ఉత్తరాఖండ్ది లోని అల్మోరా లో అమ్మవారు నిజమైన అవతారంలో ఇక్కడికి వచ్చిందని నమ్మకం. భారతదేశంలో అయస్కాంత శక్తులు ఉన్న ఏకైక ప్రదేశం ఇదేనని చెబుతారు.

అనేక శక్తులు ఈ ఆలయంతో ముడిపడి ఉన్నాయి. నాసా శాస్త్రవేత్తలు కూడా ఆలయ అయస్కాంత రహస్యాన్ని తెలుసుకోవడానికి వచ్చారు. అయితే చివరికి ఖాళీ చేతులతో తిరిగొచ్చారు

1970 నుండి 1980 ల వరకు దీనిలో డచ్ సన్యాసి ఒకరికి నివాసం గా వుండేది. ఈ టెంపుల్ వద్ద హవబగ్ వాలీ కలదు. కాలిమాట్ నుండి ఈ టెంపుల్ కు కాలి నడకన చేరవచ్చు.

స్వామి వివేకానంద, సున్యత బాబా, ఆల్‌ఫ్రెడ్ సోరెన్‌సెన్ , లామా అనగారిక గోవింద, బాబ్ డైలాన్, జార్జ్ హారిసన్, క్యాట్ స్టీవెన్స్, పాశ్చాత్య బౌద్ధ రాబర్ట్ థుర్మాన్ , రచయిత DH లారెన్స్ వంటి ప్రతి-సంస్కృతికి చెందిన అనేక మంది వ్యక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు.

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కార్తీక పూర్ణిమ సందర్భంగా కాసర్ జాతర నిర్వహిస్తారు. ఈ జాతరకు లక్షలాది మంది ప్రజలు వస్తారు. సమాచారం ప్రకారం ఈ జాతర ప్రాముఖ్యత మనదేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా విస్తృతంగా వ్యాపించింది.





























