దేవతలు నడియాడే భూమి ఉత్తరాఖండ్ లోని గర్వాల్ శ్రీనగర్ ప్రాంతంలో అలకనందా నది ఒడ్డున ప్రాచీన కాలం నాటి ధారీదేవి ఆలయం ఉంది. ధారీదేవి ఆలయం దాదాపు 8 దశాబ్దాల నుండి వున్నట్లుగా చారిత్రాత్మక కధనం. అయితే ధారీదేవి ఆలయం పైన కప్పు వుండదు. అలా కప్పు లేకుండా ఆలయాన్ని ఉంచటమే ధారీదేవికి ఆనందాన్ని కలిగిస్తుందని ఈ ప్రాంతవాసులు చెబుతారు. ఇక గర్భగుడిలో అమ్మవారి సగభాగం మాత్రమే ఉంటుంది. ఈ గుడిలోని దేవి రూపం ఉదయం బాలికగా, మధ్యాహ్నం యువతిగా సాయంత్రం వృద్ధ స్త్రీగా మారుతూ పూజలందుకుంటుంది.