పాదాల మండపం వద్దకు చేరుకోగానే మనస్సు భక్తిభావంతో నిండిపోయిందన్నారు కవిత. అలిపిరి వద్దనున్న సప్తగోప్రదక్షిణ మందిరాన్ని కవిత అనిల్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం కవిత, అనిల్ దంపతులు గో పూజ చేశారు. శ్రీక్రిష్ణునికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాయంత్రానికి కొండ మీదకు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో, నిరంతరం ప్రజాసేవకు పాటుపడాలని ఎమ్మెల్సీ కవిత భగవంతుని ప్రార్థించారు.రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఇద్దరు ముఖ్యమంత్రులు ఆయురారోగ్యాలతో ఉండాలని వేంకటేశ్వరస్వామిని వేడుకున్నారు ఎమ్మెల్సీ కవిత.