- Telugu News Photo Gallery Spiritual photos Mahashivaratri special top 10 tallest lord shiva statues in india
MahaShivaratri 2021 : మన ఇండియాలో ఉన్న అత్యంత ఎత్తైన శివుడి విగ్రహాలు.. ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా..
భోళా శంకరుడు.. పిలిస్తే వరాలు కురిపించే పరమేశ్వరుడు. ఆయనకు ఆది.. అంతం ఏమి ఉండదు. చెంబెడు నీళ్లు పోసి.. ఓ మూరెడు మారేడు దళాలతో అభిషేకిస్తే.. కోరిన కోరికలు తీర్చే ఈశ్వరుడు. శివుడుకు ఇష్టమైన రోజు మహాశివరాత్రి. ఈ రోజున భోళానాధుడు లింగాకృతిలోకి వచ్చిన రోజుగా ప్రశిస్తి. ఈరోజున శివుడికి బిల్వపత్రాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాలాధారణలు, విభూతి ధారణలు శివుడికి సమర్పిస్తుంటాం. మన ఇండియాలో ఉన్న అత్యంత ఎత్తైన శివుడి విగ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం.
Updated on: Mar 11, 2021 | 9:43 AM

మురుడేశ్వర శివుడి విగ్రహం.. కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో 122 అడుగుల ఎత్తు ఉంటుంది. అరేబియా సముద్ర ఒడ్డున కల ఈ విగ్రహం ఉంటుంది.

కోయంబత్తూర్.. కోయంబత్తూర్ లోని వెల్లియంగిరి కొండల సమీపంలో 112 అడుగుల ఎత్తైన ఆదియోగి(శివుడు) విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని పూర్తిగా స్టీల్ తో తయారుచేశారు. ఈ విగ్రహం సుమారు 500 టన్నులు ఉంటుంది.

కెంఫోర్ట్ శివాలయం.. బెంగుళూరులోని ఈ కెంఫోర్ట్ దేవాలయం ఉంది. ఈ విగ్రహం ఎత్తు సుమారు 65 అడుగులు. ఈ విగ్రహాన్ని దర్శించుకోవడానికి ఒక్కరోజే దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తుంటారు.

వడోదర.. గుజరాత్ రాష్ట్రంలోని వడోదర ప్రాంతంలో ఒక సరస్సులో శివుడు నిలుచుని ఉన్న ఎత్తైన విగ్రహం ఉంది. ఆ విగ్రహం ఎత్తు 120 అడుగులు ఉంటుంది.

శివగిరి.. కర్ణాటకలోని బీజాపూర్ కు 3 కి.మీ దూరంలో ఈ శివగిరి విగ్రహం ఉంది. ఇది 85 అడుగులు ఉంటుంది.

ఓంకారేశ్వర.. భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ఖాండ్వా జిల్లాలోనిరెండుకొండల మధ్య నర్మదా నదిలో ఈ విగ్రహం ఉంది. ఆకశం నుంచి చూస్తే ఈ విగ్రహం ఆకాశం నుండి చూస్తె ‘’ఓం ‘’ఆకారం గా కనిపిస్తుందిట.

నాగేశ్వర దేవాలయం.. గుజరాత్ రాష్ట్రంలోని జాగేస్వర్ లో కల నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఉంటుంది. ద్వారాక పట్టణానికి 12కిమీ దూరంలో ఉన్న ఈ శివుడి విగ్రహం 82 అడుగులు. లింగం మీద చిన్న చిన్న చక్రాలు ఉంటాయి. ముఖం మీద మూడు రుద్రాక్షలు ఉన్నట్లుగా కనిపిస్తుంది.

సిద్దేశ్వర ధామ్.. సిక్కింలో ఒక పెద్ద కొండ ప్రాంతంపైన 108 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం ఉంది. ఈ ప్రాంతాన్ని సిద్దేశ్వర ధామ్ అని స్థానికులు పిలుస్తుంటారు.

రాజస్థాన్ ఉదయ్ పూర్.. రాజస్థాన్ ఉదయ్ పూర్ సమీపంలోని నాథ్వారాలో 351 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం ఉంది. భారీ విగ్రహాం లోపలి నుంచి శివుని కంఠం వరకు పర్యాటకు రెండు లిఫ్టుల ద్వారా చేరుకోవచ్చు.

కల హర కి పౌరి..ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో కల హర కి పౌరి ఘాట్ ఉంది. ఈ విగ్రహం ఎత్తు 100 అడుగులు.




