- Telugu News Photo Gallery Spiritual photos Lord shiva kedarnath temple doors opened and do you know these intersting facts about this temple
Kedarnath Temple: తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం .. ఆ గుడి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..
మన దేశంలో అత్యంత పవిత్రమైన కేదార్ నాథ్ పరమశివుడి ఆలయం ఓపెన్ చేయబడింది. 12 జ్యోతిర్లింగాలలో అత్యధిక ఎత్తులో ఉన్న ఆలయం ఇది. ఈరోజు ఉదయం 5 గంటలకు పూర్తి చట్టపరమైన అభ్యాసంతో ఈ ఆలయం తెరుచుకుంది. కానీ ఇక్కడికి భక్తులకు ఎంట్రీ లేదు.
Updated on: May 17, 2021 | 11:01 PM

కేదార్‌నాథ్‌లో ఉన్న భోలేనాథ్ ఆలయం శీతకాలం తరువాత మాత్రమే పూర్తిగా తెరవబడుతుంది. కేవలం ఈ సమయంలో మాత్రమే ఆ పరమేశ్వరుడిని చూడటానికి భక్తులకు అనుమతిస్తారు. అలాగే 6 నెలలు గడిచిన వెంటనే మళ్ళీ ఈ గుడి మూసివేస్తారు. ఇందుకు కారణం అక్కడి హిమపాతం.

ఈ ఆలయం మూసివేసే సమయంలో గర్భగుడిలో అక్కడి పూజారి ఒక దీపాన్ని వెలిగిస్తారు. అది మళ్లీ ఆలయం తెరిచేవరకు ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది.

పురాణాల ప్రకారం కేదార్‌నాథ్ ఆలయ కథ పాండవులతో ముడిపడి ఉంది. ద్వాపర్ యుగంలో పాండవులు మహాభారత యుద్ధంలో విజయం సాధించినప్పుడు వారు తమ సోదరులు, బంధువుల వధతో మిక్కిలి దుఃఖాన్ని అనుభవించారు. ఆ పాపం నుండి విముక్తి పొందడానికి పాండవులు శివుడిని చూడటానికి కాశీకి చేరుకున్నారు.

ఇక ఈ విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు కోపంతో కేదార్ నాథ్ కు చేరుకున్నాడు. శివుడు వెంటే పాండవులు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక వారికి కనిపించకుండా ఉండడం కోసం శివుడు గోవు రూపాన్ని ధరించి మందలో చేరిపోయాడు.

అయితే ఈ విషయాన్ని గ్రహించిన భీముడు ఆకస్మాత్తుగా తన ఎత్తును పెంచి భారీగా పెరిగిపోయాడు. దీంతో ఆ గోవులన్నీ భీముడి కాళ్ళ సందులో నుంచి వెళ్ళిపోయాయి.

కానీ శివుడు మాత్రం వెళ్లకుండా అలానే నిల్చుండిపోయారు. ఇది గమనించిన భీముడి శివుడికి నమస్కరించి వేడుకున్నాడు. దీంతో శివుడు వారికి దర్శనమిచ్చాడు. ఇక పాపాన్ని వదిలించుకున్న పాండవులు కేదార్ నాథ్ లో శివుడి ఆలయాన్ని నిర్మించారు. అందుకే ఈ ఆలయంలో శివుడివి గోవు ఆకారంలో పూజిస్తారు.

కేదార్‌నాథ్ ఆలయం





























