- Telugu News Photo Gallery Spiritual photos Kottankulangara Chamayavilakku festival at Kottangkulangara in Kerala
Chamayavilakku Festival: స్త్రీగా మారి పురుషుల పూజలు.. కేరళలో ఘనంగా చమయవిళక్కు ఉత్సవాలు
కేరళ కొల్లాంలోని చవరాలో ఉన్న ప్రసిద్ధ కొట్టన్‌కులంగర దుర్గాదేవి ఆలయంలో చమయవిళక్కు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో వేలాదిమంది పురుషులు స్త్రీ వేషధారణలో అందంగా అలంకరించుకొని, బంగారు నగలు ధరించి అమ్మవారిని సేవించేందుకు తరలి వచ్చారు.
Updated on: Mar 26, 2023 | 12:22 PM

కేరళ కొల్లాంలోని చవరాలో ఉన్న ప్రసిద్ధ కొట్టన్‌కులంగర దుర్గాదేవి ఆలయంలో చమయవిళక్కు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో వేలాదిమంది పురుషులు స్త్రీ వేషధారణలో అందంగా అలంకరించుకొని, బంగారు నగలు ధరించి అమ్మవారిని సేవించేందుకు తరలి వచ్చారు.

ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం ఐదు ఒత్తులు కలిగిన ప్రత్యేక దీపాలను వెలిగించి అమ్మవారికి దీపారాధన చేస్తారు. రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయి. చమయవిళక్కు ఉత్సవాల్లో ట్రాన్స్‌జెండ్ర్స్ కూడా పెద్దసంఖ్యలో పాల్గొని పూజలు చేస్తారు.

పురుషులు స్త్రీగా అలంకరించుకుంటే దేవుడు సంతోషించి వారి కోరికలను తీరుస్తాడని ఇక్కడి భక్తుల నమ్మకం. కొన్నేళ్లుగా బంధువులు, స్నేహితులతో దుర్గ భగవతిని ఇలా స్త్రీ రూపంలో వచ్ఇచ సేవించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.

ఈ ఉత్సవాలు ప్రతి ఏటా మలయాళి నెల ‘మీనం’ 10 ,11వ తేదీల్లో ఘనంగా జరుపుకుంటారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో.. ప్రతిరోజు అర్ధరాత్రి వరకు పూజలు నిర్వహిస్తారు.

ఈ ఉత్సవాలకు సంబంధించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఓ రోజు కొందరు పిల్లలు ఆవులు మేపడానికి అడవి ప్రాంతానికి వెళ్లారట. అక్కడ వారికి ఒక కొబ్బరికాయ కనిపించిందట. దాన్ని ఆ పిల్లలు అక్కడ కనిపించిన ఓ బండరాయికేసి పగలగొట్టగా ఆ రాయినుంచి రక్తం వచ్చిందట. దాంతో పిల్లలు భయపడి విషయం తల్లిదండ్రులకు చెప్పారట.

వారు పండితులను ఆశ్రయించగా వరు ఆ రాయిలో వనదుర్గ శక్తి దాగి ఉందని, వెంటనే అక్కడ ఆలయ నిర్మాణం చేయాలని చెప్పారట. ఆలా అక్కడ దుర్గామాత ఆలయం నిర్మించి, ఏటా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారట. కుల మతాలకు అతీతంగా అన్ని ప్రాంతాలవారూ పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొనడం మరో విశేషం.




