- Telugu News Photo Gallery Spiritual photos Famous temples in india: shakuni and duryodhana mandir gidheshwar temple karna mandir hidimba devi mandir know the details
Uniqu Temples: మన దేశంలో హిడంబి, శకుని, దుర్యోధనుడి వంటి వారికీ ఆలయాలు .. ఎక్కడ ఉన్నాయంటే..
దేశవ్యాప్తంగా అనేక ప్రసిద్ధిగాంచిన దేవాలయాలున్నాయి. ఆలయాల పేర్లు, ఆ ఆలయాల చరిత్ర వెంటనే మనస్సులోకి వస్తుంది. వైష్ణో దేవి ఆలయం, కేదార్‌నాథ్ ఆలయం, బద్రీనాథ్ ఆలయం, స్వర్ణ దేవాలయం, కాశీ విశ్వనాథ ఆలయం వంటి అనేక దేవాలయాలు దేశంలోని ప్రసిద్ధ దేవాలయాల జాబితాలో చేర్చబడ్డాయి. ఈ ఆలయాలు అంతర్జాతీయ ఖ్యాతిని కూడా సొంతం చేసుకున్నాయి. అయితే అంతగా ప్రసిద్ధి చెందని దేవాలయాలు.. లేదా దేవుడు విగ్రహం లేని ఆలయాలు, విగ్రహ రూపంలో దర్శనం ఇవ్వని ఆలయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆలయాలు భక్తుల అచంచల విశ్వాసంతో ముడిపడి ఉన్నాయి.
Updated on: Mar 10, 2025 | 4:28 PM

దేశవ్యాప్తంగా అనేక ప్రసిద్ధిగాంచిన దేవాలయాలున్నాయి. ఆలయాల పేర్లు, ఆ ఆలయాల చరిత్ర వెంటనే మనస్సులోకి వస్తుంది. వైష్ణో దేవి ఆలయం, కేదార్‌నాథ్ ఆలయం, బద్రీనాథ్ ఆలయం, స్వర్ణ దేవాలయం, కాశీ విశ్వనాథ ఆలయం వంటి అనేక దేవాలయాలు దేశంలోని ప్రసిద్ధ దేవాలయాల జాబితాలో చేర్చబడ్డాయి. ఈ ఆలయాలు అంతర్జాతీయ ఖ్యాతిని కూడా సొంతం చేసుకున్నాయి. అయితే అంతగా ప్రసిద్ధి చెందని దేవాలయాలు.. లేదా దేవుడు విగ్రహం లేని ఆలయాలు, విగ్రహ రూపంలో దర్శనం ఇవ్వని ఆలయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆలయాలు భక్తుల అచంచల విశ్వాసంతో ముడిపడి ఉన్నాయి.

హిడింబా దేవి ఆలయం: పాండవుల మధ్యముడు భీముడి భార్య హిడింబా దేవి. ఈ ఆలయంలో వెలసిన హిడింబ దేవిని వనదేవతగా, ప్రకృతి దేవతగా భావించి పూజిస్తారు. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో ఉంది. ఇది హిడింబి దేవి లేదా హిర్మా దేవికి అంకితం చేయబడిన పురాతన గుహ ఆలయం. ఈ ఆలయం మహాభారత కాలంతో ముడిపడి ఉంది.ఈ ఆలయంలో రాక్షసిని పూజిస్తే కోరుకున్న వారితో వివాహం జరుగుతుందట. మనాలి సందర్శించడానికి వెళ్ళే పర్యాటకులు ఖచ్చితంగా హిడింబా దేవి ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు.

గిద్ధేశ్వర్ ఆలయం: రాక్షస గుణం వ్యక్తులకు ఆలయాలు మాత్రమే కాదు.. రాక్షస గుణం ఉన్న వారితో పాటు (రాబందు) జటాయువు వంటి పక్షికి కూడా ఆలయం ఉంది. ఈ ఆలయ చరిత్ర రామాయణ కాలంతో ముడిపడి ఉంది. బీహార్‌లోని జాముయి జిల్లాలో ఉన్న గిద్దీశ్వర్ ఆలయాన్ని సందర్శించడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు. పురాణాల ప్రకారం గిద్దీశ్వర ఆలయానికి రాబందు, దేవుడు అనే పదాలు కలిపి గిద్ధేశ్వర్ అని పేరు పెట్టారు. ఈ ఆలయాన్ని సందర్శించి జటాయువుని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరతాయని నమ్మకం. ఈ ఆలయాన్ని స్థానికంగా శివాలయం అని పిలుస్తారు. ఇతిహాసాల ప్రకారం, రావణుడు, జటాయువు మధ్య యుద్ధం ఈ ప్రదేశంలోనే జరిగిందని నమ్మకం.

దుర్యోధన ఆలయం: దృతరాష్ట్రుడికి గాంధారికి 100 మంది కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ కౌరవులలో ప్రధముడు దుర్యోధనుడు. కౌరవ రాజవంశానికి చెందిన దుర్యోధనుడికి కూడా మన దేశంలో ఆలయం ఉంది. కేరళలోని కొల్లంలో శకుని ఆలయానికి సమీపంలో దుర్యోధనుడి ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం దేశంలో దుర్యోధనుని ఏకైక ఆలయం. ఈ ఆలయంపై కూడా ప్రజలకు పూర్తి విశ్వాసం ఉం. శకుని ఆలయాన్ని సందర్శించే వారు ఖచ్చితంగా ఈ దుర్యోధనుడి ఆలయాన్ని సందర్శిస్తారు.

శకుని ఆలయం: మహాభారతంలో ముఖ్యమైన వ్యక్తి శకుని. గాంధారికి సోదరుడు. కౌరవులకు మేనమామ. తన పగతో అయినవారితోనే ఆటలాడిన శకుని దుష్ట పన్నాగాలతో పాండవులను మాయా జూదంలో ఓడించి రాజ్యం నుంచి వెల్లగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. చివరకు కురుక్షేత్ర యుద్ధానికి బాటలు వేశాడు. అయితే దుష్ట మామగా పిలుచుకునే దుర్యోధనుడి మామ శకునికి కూడా ఆలయం ఉంది. ఈ ఆలయం కేరళలోని కొల్లం జిల్లాలోని పవిత్రేశ్వరంలో ఉంది. ప్రతి వ్యక్తికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయని ప్రజలు నమ్ముతారు. కౌరవుల పట్ల శకుని మరణం వరకు అతనిలో ఉన్న త్యాగ భావన అతన్ని పూజ్యమైనదిగా చేస్తుంది. అందుకే ప్రజలు శకునిని పూర్తి భక్తితో పూజిస్తారు. ఈ ఆలయానికి ప్రతిరోజూ వేలాది మంది దర్శనం కోసం వస్తారు.

కర్ణుడి ఆలయం: కుంతీ సుర్యుడుకి జన్మించిన కర్ణుడు మహా భారతంలో చాలా ముఖ్యమైన వ్యక్తి. దాన వీర శూర కర్ణగా ప్రఖ్యాతిగాంచిన కర్ణుడికి ఓ ఆలయం ఉంది. మహాభారత కాలానికి సాక్షిగా ఉన్న ఈ ఆలయం యుపిలోని మీరట్ నగరానికి సమీపంలో ఉంది. ఆలయం లోపల ఒక పురాతన శివలింగం కూడా ఉంది. ఈ శివలింగానికి నీరు సమర్పిస్తే ఆగిన పనులు పూర్తవుతాయని నమ్ముతారు. ఈ శివలింగ దర్శనం చేసుకోవడానికి చాలా మంది ఇక్కడికి వస్తారు. ఈ శివలింగాన్ని కర్ణుడు స్వయంగా ప్రతిష్టించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే ఈ ఆలయం హిందువుల విశ్వాస కేంద్రంగా ఉంది.





























