- Telugu News Photo Gallery Spiritual photos Chaturmas 2022: Do not do these things during the period of Chaturmas
Chaturmas: తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస కాలం.. పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. జీవితంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి
Toli Ekadashi-Chaturmas: ఈ ఏడాది దేవశయని ఏకాదశి జూలై 10 ఆదివారం వచ్చింది. దేవశయని ఏకాదశి రోజున విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లాడని. ఇలా 4 నెలల పాటు నిద్రలో ఉంటాడని నమ్మకం. ఈ 4 నెలల్లో కొన్ని పనులు చేయడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది.
Updated on: Jul 07, 2022 | 5:24 PM

ఈసారి ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి జూలై 10వ తేదీన వచ్చింది. ఈ ఏకాదశిని దేవశయనీ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి నుండి విష్ణువు 4 నెలల పాటు నిద్ర యోగంలోకి వెళ్తాడు. ఈ సమయంలో కొన్ని పనులు చేయడం నిషిద్ధమని భావిస్తారు. ఆ పని ఏమిటో తెలుసుకుందాం.

చాతుర్మాస సమయంలో కొన్ని వస్తువులను తినడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలు మొదలైనవి ఆహారంగా తీసుకోడం నిషిద్ధం. తామసిక ఆహారం తీసుకోవడం వల్ల మనసులో చెడు ఆలోచనలు వస్తాయి. చాతుర్మాసంలో మిత ఆహారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో సిగరెట్, పొగాకు కూడా తీసుకోకూడదు.

చాతుర్మాసంలో సనాతన ధర్మానికి సంబంధించిన పనులు చేయండి. భగవంతుని పూజించండి. దేవుడిని ధ్యానించండి. ఇలా చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ కాలంలో మీరు ఏపని ప్రారంభించినా చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది. దీంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి

చాతుర్మాస సమయంలో శుభకార్యాలు చేయడం చాలా అశుభం. నూతన పనుల ప్రారంభోత్సవాలు, వివాహ వేడుకలు, నిశ్చితార్థం, జుట్టు క్షవరం, పిల్లలకు నామకరణం చేయకూడదు. ఈ పనులు చేయడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. అశుభంగా పేర్కొన్నారు.

ఈ రోజుల్లో మంచం మీద పడుకోకూడదు. నేలపై పడుకోవాలి. ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడు సంతోషిస్తాడు. తులసికి క్రమం తప్పకుండా నీరు పోయాలి. ఇలా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. చాతుర్మాస దీక్షలో ఈ నియమాలను పాటిస్తే.. పేదరికం నుంచి భయపడతారు. సుఖ శాంతులు కలుగుతాయి.




