- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti never take help from these people they can harm you in telugu
Chanakya Niti: ఇలాంటి వ్యక్తులు శత్రువు కంటే ప్రాణాంతకం.. వీరి నుంచి ఎప్పుడూ సహాయం తీసుకోకండి
ఆచార్య చాణక్య గొప్ప దౌత్యవేత్త, రాజకీయవేత్త, ఆర్థికవేత్త , సామాజికవేత్త. ఆయన నీతిశాస్త్రంలో అనేక విషయాలను ప్రస్తావించారు. ఈ విషయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు.
Updated on: Aug 28, 2022 | 4:59 PM

ఆచార్య చాణక్యుడు ప్రకారం, యువత తప్పు సాంగత్యానికి దూరంగా ఉండాలి. చెడు అలవాట్లు, వ్యసనాల వారి మధ్య కూర్చోవడం వల్ల అవతలి వారికీ చెడు అలవాట్లు ఖచ్చితంగా వస్తాయి. దీని కారణంగా యువత తన లక్ష్యాన్ని సాధించలేదు.

దొంగిలించబడిన డబ్బు - దొంగతనం చేసి.. సంపాదించిన డబ్బు లేదా తప్పుడు మార్గాల్లో సంపాదించిన డబ్బులు వ్యక్తి వద్ద ఎక్కువ కాలం ఉండదు. అలాంటి సంపాదనకు విలువ ఉండదు.. అటువంటి వ్యక్తిని ఎవరూ గౌరవంగా చూడరు. కనుక దొంగతనం చేసి డబ్బు సంపాదించకండి.

కోడి పుంజు - సూర్యోదయానికి ముందే కోడిపుంజు లేస్తుంది. అంతేకాదు వ్యతిరేకశక్తులపై పోరాడుతుంది. ఆహారాన్ని పంచుకోవడం, మీ స్వంత శక్తితో ఆహారం పొందడం. ఈ లక్షణాలన్నీ ఒక వ్యక్తి కోడి నుండి నేర్చుకోవచ్చు. ఈ లక్షణాలు మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి.

మత్తు వంటి అలవాటుకు యువత దూరంగా ఉండాలి. మత్తు కారణంగా మనిషి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బలహీనుడవుతాడు. దీంతో ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యసనాలు యువత వర్తమానాన్ని, భవిష్యత్తును పాడుచేస్తాయి.

కోపం ఒక వ్యక్తికి అతిపెద్ద శత్రువు. కోపాన్ని అదుపు చేసుకోలేని వ్యక్తి నుండి ఎప్పుడూ సహాయం తీసుకోకండి. అలాంటి వ్యక్తులు కష్ట సమయాల్లో మీ సమస్యను మరింత పెంచుతారు.




