- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti in telugu: these events are considered a sign of bad luck
Chanakya Niti: ఇటువంటి సంఘటనలు జీవితంలో దురదృష్టానికి సంకేతం మంటోన్న ఆచార్య చాణక్య
మనిషి జీవితంలో సుఖ దుఃఖాలు సహజం. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో ఒక వ్యక్తి మొత్తం జీవితాన్ని మార్చే కొన్ని సంఘటనల గురించి కూడా ప్రస్తావించాడు. ఈ కారణంగా ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. అదే విధంగా కొన్ని కొన్ని సంఘటనలు ఆ మనిషి జీవితాన్ని విషాదం చేస్తాయి.
Updated on: Oct 03, 2022 | 11:27 AM

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మానవ జీవితంలోని అనేక ముఖ్యమైన అంశాలను గురించి చెప్పాడు. ఈ విషయాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు. మానవ జీవితాన్ని నరకంగా మార్చే చాణక్య నీతిలో ఇలాంటి కొన్ని సంఘటనలు కూడా ప్రస్తావించబడ్డాయి. ఆ సంఘటనలు ఏంటో తెలుసుకుందాం.

ఆహారం - ఆచార్య చాణక్యుడు ప్రకారం.. ఒక వ్యక్తి ఇంట్లో ఎప్పుడూ ఆహారాన్ని ఎల్లపుడూ నిల్వ ఉంచుకోవాలి. దీని వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎప్పుడూ నివసిస్తుందని నమ్ముతారు. ఇంటికి వచ్చిన అతిథిని ఎప్పుడూ ఆకలితో ఉంచకూడదు.

గౌరవం: చాణక్యుడి నీతి ప్రకారం, గౌరవం మనుషుల మధ్య బలమైన, దీర్ఘకాలిక సంబంధాన్ని కొనసాగేలా చేస్తుంది. ఏదైనా సంబంధంలో గౌరవం లేనప్పుడు, సంబంధం వెలసిన దుస్తులా మారుతుంది. గౌరవం ఉన్న సంబంధం ఆనందం ముగుస్తుంది. ప్రతి బంధానికి పరిమితులు ఉంటాయి. ఈ పరిమితిని ఎవరూ దాటకూడదు.

వాదించుకోవడం - ఆచార్య చాణక్యుడు ప్రకారం, తల్లిదండ్రులు పిల్లల ముందు ఒకరినొకరు కించపరుచుకుంటూ మాట్లాడకూడదు. గొడవలు పడకూడదు. ఒకరికొకరు ఎప్పుడూ గౌరవం ఇచ్చి పుచ్చుకుంటూ ఉండాలి. పిల్లల దృష్టిలో తల్లిదండ్రుల మీద గౌరవం పెరుగుతుంది.

భాష విషయాల్లో అదుపు- ఆచార్య చాణక్యుడు ప్రకారం, పిల్లల ముందు ఎప్పుడూ ఒకరినొకరు దూషించుకుంటూ మాటలు మాట్లాడకూడదు. భాష విషయంలో పిల్లల ముందు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. పిల్లల ముందు మంచి భాషను ఉపయోగించండి. ఎందుకంటే పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువు. పిల్లలు భాషను మొదట తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు.




