- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti if these 4 things happen in married life then life becomes heaven
Chanakya Niti: ఈ నాలుగు లక్షణాలు ఉంటే.. భార్యాభర్తల వైవాహిక బంధం స్వర్గం అంటోన్న చాణక్య
వైవాహిక జీవితం ఆనందమయం కావాలంటే చాణక్య నీతిలో ప్రస్తావించిన విషయాలను నేటి తరం మనుషులు తెలుసుకోవలసి ఉంది. చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం వలన భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితం స్వర్గంగా మారుతుందని పెద్దలు నమ్మకం.
Updated on: Oct 31, 2022 | 3:11 PM

అసూయతో ఉండే వ్యక్తులు: మీ పట్ల అసూయపడే వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. అలాంటి వారు మీరు విజయం సాధించడాన్ని అస్సలు చూడలేరు. మీరు ముందుకు వెళ్లకుండా నిరోధించడానికి అనేక అడ్డంకులను సృష్టిస్తారు. అందుకే వీరిని దరిచేరనివ్వొద్దని చాణుక్యుడు తెలిపాడు.

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. ఆచార్య చాణక్య ప్రకారం, పిల్లల ముందు కుటుంబ సభ్యులు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. పిల్లల ముందు పొరపాటున కూడా కొన్ని పనులను చేయవద్దని ఆచార్య సూచించారు. ఆ పనులు ఏంటో తెలుసుకుందాం.

భాష విషయాల్లో అదుపు- ఆచార్య చాణక్యుడు ప్రకారం, పిల్లల ముందు ఎప్పుడూ ఒకరినొకరు దూషించుకుంటూ మాటలు మాట్లాడకూడదు. భాష విషయంలో పిల్లల ముందు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. పిల్లల ముందు మంచి భాషను ఉపయోగించండి. ఎందుకంటే పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువు. పిల్లలు భాషను మొదట తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు.

ఆచార్య చాణక్యుడు.. నీతి శాస్త్రంలో దాదాపు ప్రతి రంగానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించాడు. ఈ విషయాలను అనుసరించడం ద్వారా ప్రతీ వ్యక్తి తన జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవచ్చు. అందుకే చాలామంది జీవితంలో తప్పటడుగులు వేయకుండా ఉండేందుకు.. ఉన్నత స్థానంలో ఎదిగేందుకు చాణుక్యుడు నీతిశాస్త్రంలో బోధించిన విషయాలను అనుసరిస్తుంటారు.

గౌరవం: చాణక్యుడి నీతి ప్రకారం, గౌరవం మనుషుల మధ్య బలమైన, దీర్ఘకాలిక సంబంధాన్ని కొనసాగేలా చేస్తుంది. ఏదైనా సంబంధంలో గౌరవం లేనప్పుడు, సంబంధం వెలసిన దుస్తులా మారుతుంది. గౌరవం ఉన్న సంబంధం ఆనందం ముగుస్తుంది. ప్రతి బంధానికి పరిమితులు ఉంటాయి. ఈ పరిమితిని ఎవరూ దాటకూడదు.




