- Telugu News Photo Gallery Spiritual photos Astro tips in Telugu: loosing these white things from your hands create money problem in life
Astro Tips: మీ చేతుల నుంచి ఈ తెల్లని వస్తువులను తరచుగా నేలమీద పడనిస్తున్నారా!..
Astro Tips: జ్యోతిషశాస్త్రంలో ఇంటి నిర్వహణ విషయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. చాలా సార్లు వ్యక్తులు తమకు తెలియకుండానే తమ చేతులతో కొన్ని వస్తువులను నేలమీద జారవిడచడం.. లేదా ఇతరుల చేతికి అందించడం చేస్తుంటారు. ఇలా చేయడం వలన ఆర్ధిక కష్టాలు ఏర్పడతాయని పెద్దల నమ్మకం.
Updated on: Jun 13, 2022 | 10:29 AM

పురాణ గ్రంథాల ప్రకారం.. మీ చేతుల నుండి కొన్ని తెల్లటి వస్తువులు నేలమీదకు జారడం మంచిది కాదు.. ఇలా చేయడం వలన ఇంట్లో వ్యతిరేకత, పేదరికం, డబ్బు లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.

శంఖం: పూజలో శంఖానికి ఉన్న విశేష ప్రాధాన్యత తెలిసిందే. ఆలయంలో శంఖం ఉంచే ముందు కూడా కొన్ని నియమాలు పాటిస్తారు. అయితే శంఖం చేతి నుంచి కిందపడితే..ఆ పరిస్థితి ఇంటికి మంచిది కాదు.

పాలు: పాలు లేదా దానితో చేసిన వస్తువులు చేతిలో నుండి పడిపోతే.. మంచిది కాదు. ఇంట్లోని పిల్లల నుంచి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

కొబ్బరి: హిందూమతంలో కొబ్బరి కాయ శుభకార్యాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుందిక్. అయితే శుభ కార్యంలో చేతి నుండి కొబ్బరికాయ కింద పడితే అశుభమని నమ్ముతారు. ప్రసాదం పంచేటప్పుడు కూడా కొబ్బరి ముక్కను చేతి నుండి జారవిడిచినట్లయితే.. మంచిది కాదు..

ఉప్పు: జ్యోతిష్య శాస్త్రంలో ఉప్పుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రజలు తమ ఇళ్లలో ఉప్పుకు సంబంధించిన కొన్ని నియమాలు పాటించాలి. దీంతో జీవితంలో సుఖ సంపదలు వస్తాయి. ఉప్పు చేతి నుంచి నేలమీదకు జారితే.. ఆ వ్యక్తి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని అంటారు.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)




