- Telugu News Photo Gallery Spiritual photos Acharya Chanakya: according to chanakya niti never tolerate these toxic situations in life
Chanakya Niti: ఎవరైనా జీవితంలో ఈ పరిస్థితులను ఎదుర్కోవడం విషంతో సమానం అంటోన్న చాణక్య..
ఆచార్య చాణక్యుడు జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించి తన అభిప్రాయాలను ఆలోచనలు నీతి శాస్త్రంలో చెప్పారు,. నేటికీ చాణక్య ఆలోచనలు మనందరికీ చాలా ఉపయోగపడతాయి. ఒక వ్యక్తి జీవితంలో ఆత్మగౌరవం అతి ముఖ్యమైందని పేర్కొన్నాడు
Updated on: Aug 23, 2022 | 5:05 PM

కోపం ఒక వ్యక్తికి అతిపెద్ద శత్రువు. కోపాన్ని అదుపు చేసుకోలేని వ్యక్తి నుండి ఎప్పుడూ సహాయం తీసుకోకండి. అలాంటి వ్యక్తులు కష్ట సమయాల్లో మీ సమస్యను మరింత పెంచుతారు.

గోడలలో తేమ: ఇళ్లలోని గోడలపై తేమ పేదరికానికి నిదర్శనమని చాణక్య నీతి చెబుతోంది. సీలింగ్ ఇంట్లోకి తేమ రాకుండా ఇంటి యజమాని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక ఇంటికి సమయానికి మరమ్మతులు చేయడం చాలా ముఖ్యం. గోడలపై తేమ ఎక్కువ కాలం ఉండే ఇళ్లలో సమస్యలు వస్తూనే ఉంటాయి.

కొంగ - కొంగకు తన ఇంద్రియాలను ఎలా నియంత్రించాలో తెలుసు. అదే విధంగా సంయమనంతో పని చేస్తే విజయం సులువుగా దొరుకుతుంది, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేని వ్యక్తి ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉంటాడు. కాబట్టి మీ మనస్సును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి. ఏకాగ్రతతో పని చేయండి.

కోడి పుంజు - సూర్యోదయానికి ముందే కోడిపుంజు లేస్తుంది. అంతేకాదు వ్యతిరేకశక్తులపై పోరాడుతుంది. ఆహారాన్ని పంచుకోవడం, మీ స్వంత శక్తితో ఆహారం పొందడం. ఈ లక్షణాలన్నీ ఒక వ్యక్తి కోడి నుండి నేర్చుకోవచ్చు. ఈ లక్షణాలు మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి.

మత్తు వంటి అలవాటుకు యువత దూరంగా ఉండాలి. మత్తు కారణంగా మనిషి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బలహీనుడవుతాడు. దీంతో ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యసనాలు యువత వర్తమానాన్ని, భవిష్యత్తును పాడుచేస్తాయి.




