నానబెట్టిన ఖర్జూరం తేలికగా జీర్ణమవుతుంది. అలాగే ఖర్జూరంలోని విటమిన్లు, మినరల్స్ మరింత చురుగ్గా మారతాయి. శరీరానికి ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాలను అందిస్తుంది. ఖర్జూరంలో కాల్షియం, మాంగనీస్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి ఎముకల దృఢత్వానికి తోడ్పడతాయి. కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులను నివారించడానికి ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన ఖర్జూరం తినడం అలవాటు చేసుకోవాలి.